Chaitra Rai: రెండోసారి తల్లికాబోతున్న దేవర నటి.. సీక్రెట్‏గానే ఉంచామంటూ పోస్ట్..

బుల్లితెరపై తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది చైత్ర రాయ్. ఎన్నో సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని టీవీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. కొన్నాళ్లపాటు సీరియల్స్ మానేసిన చైత్ర.. ఇప్పుడు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. తాజాగా తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది.

Chaitra Rai: రెండోసారి తల్లికాబోతున్న దేవర నటి.. సీక్రెట్‏గానే ఉంచామంటూ పోస్ట్..
Chaitra Rai

Updated on: Jul 11, 2025 | 6:07 PM

చైత్ర రాయ్.. తెలుగు సీరియల్ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. అష్టా చమ్మా సీరియల్ ద్వారా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించిన చైత్ర.. పెళ్లి తర్వాత సీరియల్స్ మానేసింది. తాజాగా ఇప్పుడు తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తను మరోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో తన భర్త, కూతురితో కలిసి మెటర్నటీ ఫోటోషూట్ జ్ఞాపకాలను పంచుకుంది. ఈ వీడియోను షేర్ చేస్తూ.. “ప్రెగ్నెన్సీ విషయాన్ని కొంతకాలంగా మేము రహస్యంగానే ఉంచాం. ఇప్పుడు ఆ సీక్రెట్ ను మీ అందరితో పంచుకోవాలనిపించింది. నాకు మరో బేబీ రాబోతుంది. నిశ్క సెట్టి అక్కగా ప్రమోషన్ పొందనుంది. రెండోసారి గర్భం దాల్చినప్పటి నుంచి మా మనసులు సంతోషంతో నిండిపోయాయి. మీ ప్రేమాభిమానాలు మా పై ఎప్పటికీ ఇలాగే ఉండాలి” అంటూ రాసుకొచ్చింది.

దీంతో చైత్ర రాయ్ దంపతులకు అభిమానులు, సీరియల్ సెలబ్రేటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చైత్ర దంపతులకు ఇదివరకే కూతురు నిష్కశెట్టి ఉంది. కన్నడ పరిశ్రమలో అనేక సీరియల్స్ ద్వారా నటిగా గుర్తింపు తెచ్చుకుంది చైత్ర. అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, ఒకరికి ఒకరు, దటీజ్ మహాలక్ష్మి, రాధకు నీవేరా ప్రాణం వంటి సీరియల్స్ సైతం తెలుగులో చైత్రకు గుర్తింపు తెచ్చిపెట్టాయి.

ఇవి కూడా చదవండి

ఇక ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో కీలకపాత్ర పోషించింది చైత్ర. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఇక దేవర పార్ట్ 2లోనూ చైత్ర రాయ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..