మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్న దీపిక పదుకొనే.. మోస్ట్‌ వాల్యుబుల్‌ ఫీమేల్‌ సెలబ్రిటీగా టాప్ ప్లేస్

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకొనే మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. కమర్షియల్ సినిమాలతో పాటు ఛాలెజింగ్‌ రోల్స్‌ కూడా చేస్తున్న దీపిక ఇమేజ్‌తో పాటు బ్రాండ్‌ వాల్యూను కూడా భారీగా పెంచుకుంటున్నారు.

మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్న దీపిక పదుకొనే.. మోస్ట్‌ వాల్యుబుల్‌ ఫీమేల్‌ సెలబ్రిటీగా టాప్ ప్లేస్
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 12, 2021 | 9:52 PM

Deepika padukone: బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకొనే మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. కమర్షియల్ సినిమాలతో పాటు ఛాలెజింగ్‌ రోల్స్‌ కూడా చేస్తున్న దీపిక ఇమేజ్‌తో పాటు బ్రాండ్‌ వాల్యూను కూడా భారీగా పెంచుకుంటున్నారు. రీసెంట్‌గా సెలబ్రిటీ బ్రాండ్‌ వాల్యూ పై చేసిన స్టడీలో ఫీమేల్‌ స్టార్స్‌లో టాప్‌ చైర్‌ నిలబెట్టుకున్నారు దీపిక. గత ఏడాది కూడా మోస్ట్‌ వాల్యుబుల్‌ ఫీమేల్‌ సెలబ్రిటీగా రికార్డ్‌ సెట్‌ చేసిన దీపికా.. ఈ ఏడాది కూడా తన ప్లేస్‌ కాపాడుకున్నారు.

కరోనా ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీ మీద భారీ ఇంపాక్ట్ చూపించినా దీపిక ఇన్‌కం మీద… ఏ మాత్రం నెగటివ్‌ షేడ్‌ పడలేదు. ఈ టైంలోనూ బ్రాండింగ్స్‌తో 50.4 మిలియన్‌ డాలర్స్‌ సంపాదించారు దీపిక పదుకొనే. గత ఏడాది దీపిక నటించిన ఒక్క సినిమా మాత్రమే థియేటర్లలోకి వచ్చింది. లాస్ట్ జనవరిలో ఛపాక్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు ఈ స్టార్ హీరోయిన్‌. అయితే సినిమాలు లేకపోయినప్పటికీ, బ్రాండింగ్‌లు మాత్రం తగ్గలేదు.

ఈ మధ్యే షూటింగ్‌లు రీ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ… ఈ ఏడాది మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టారు. ప్రజెంట్ పటాన్‌తో పాటు షకున్ బాత్రా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాల తరువాత హృతిక్ రోషన్‌లో కలిసి యాక్షన్ థ్రిల్లర్ ఫైటర్‌లో నటించేందుకు ఓకే చెప్పారు. ఇండియన్‌ సూపర్ స్టార్‌ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లర్‌లోనూ… హీరోయిన్‌గా నటించేందుకు ఓకే చెప్పారు దీపిక.

Also Read:

‘నేను ఏవి కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతానో అవే వేసుకుంటా’.. డ్రెస్సింగ్ విషయంలో అదా శర్మ కామెంట్స్

Happy Birthday Jagapathi Babu: జగ్గూభాయ్‌.. ఈ ఏడాదిలో ప్రతి నెలా ఒక సినిమా రిలీజ్‌ పక్కా..!