‘నేను ఏవి కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతానో అవే వేసుకుంటా’.. డ్రెస్సింగ్ విషయంలో అదా శర్మ కామెంట్స్
రీసెంట్‌గా డ్రంక్ అండ్ హై అనే మ్యూజిక్ వీడియోతో ఆడియన్స్ ముందుకు వచ్చారు హర్ట్ ఎటాక్ బ్యూటీ. ఈ సాంగ్ ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన అదా శర్మ చాలా విషయాలను షేర్ చేసుకున్నారు.
రీసెంట్‌గా డ్రంక్ అండ్ హై అనే మ్యూజిక్ వీడియోతో ఆడియన్స్ ముందుకు వచ్చారు హర్ట్ ఎటాక్ బ్యూటీ. ఈ సాంగ్ ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన అదా శర్మ చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా తన పెళ్లి గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ. లవ్‌లో ఉన్నారా? అని అడిగితే…. నా హెయిర్ కలర్‌ను యాక్సెప్ట్ చేసే వరుడు దొరకాలిగా అంటు ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు.
మ్యూజిక్ ఆల్బమ్‌లో గ్రీన్ కలర్ హెయిర్‌తో కనిపించారు అదా శర్మ. హెయిర్ కలర్ విషయంలో ప్రయోగాలు చేయటం ఇష్టమన్న ఈ బ్యూటీ.. ఇలాంటి ఫంకీ స్టైల్స్‌ను ఓకే చేసే వ్యక్తి దొరికితే పెళ్లికి రెడీ అంటున్నారు. సరదాగా ఇలాంటి కామెంట్స్ చేసినా.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఈ బ్యూటీకి లేనట్టే ఉంది. అందుకేనేమో… ‘అస్సలు నేను పెళ్లి విషయం ఆలోచించలేదు.. మెంటల్‌గా పెళ్లికి ప్రిపేర్ అయిన తరువాత అఫీషియల్‌గా చెప్తా’నంటూ పెళ్లి టాపిక్‌ను సైడ్ చేశారు అదా.
అంతేకాదు… బోల్డ్ ఫోటోషూట్‌లతో అదరగొట్టే అదా శర్మ.. డ్రెస్సింగ్ విషయంలోనూ ఇంట్రస్టింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ‘నేను ఏది కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతానో అలాంటి డ్రెస్‌లే వేసుకుంటా. అంతేగానీ పర్టిక్యులర్‌గా గ్లామరస్‌గా కనిపించాలన్న ఉద్దేశంతో అయితే డ్రెసప్ కాను” అంటూ క్లియర్ కట్‌గా చెప్పేశారు. అయితే అదా సోషల్ మీడియా పేజ్‌లను ఫాలో అవుతున్న నెటిజెన్లు మాత్రం ఈ డైలాగ్స్ అస్సలు సింక్ అవ్వట్లేదంటూ సర్‌కాస్టిక్ మెసేజ్‌లు పోస్ట్ చేస్తున్నారు.
Also Read: