Happy Birthday Jagapathi Babu: జగ్గూభాయ్.. ఈ ఏడాదిలో ప్రతి నెలా ఒక సినిమా రిలీజ్ పక్కా..!
హీరో అయితే ఏడాదికి మహా అయితే రెండు సినిమాలు చేసే వారేమో.. కానీ విలన్‌గా మారి ఏడాదంతా తానే థియేటర్లలో ఉంటున్నారు మ్యాన్లీ స్టార్ జగపతి బాబు.
Happy Birthday Jagapathi Babu: హీరో అయితే ఏడాదికి మహా అయితే రెండు సినిమాలు చేసే వారేమో.. కానీ విలన్‌గా మారి ఏడాదంతా తానే థియేటర్లలో ఉంటున్నారు మ్యాన్లీ స్టార్ జగపతి బాబు. ఫిబ్రవరి 12న ఎఫ్‌సీయూకే సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న జగ్గూభాయ్.. ఈ ఏడాదిలో… ప్రతి నెలా ఒక సినిమా రిలీజ్ ఉండేలా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. మ్యాగ్జిమమ్ టాలీవుడ్ సినిమాలతోనే క్యాలెండర్‌ను కవర్ చేస్తున్న జగపతి బాబు.. మిస్ అయిన మంథ్స్‌ను కన్నడ, తమిళ సినిమాలతో కవర్ చేస్తున్నారు.
ఫిబ్రవరిలో ఎఫ్‌సీయూకే, మార్చ్‌లో రాబర్ట్, ఏప్రిల్‌లో టక్ జగదీష్, మేలో లక్ష్య తరువాత గుడ్ లక్ సఖి, పుష్ప, రిపబ్లిక్, లాభం ఇలా జగ్గూ భాయ్ క్యాలెండర్ అంతా ఫుల్‌గా ఫిక్స్ అయిపోయింది. సినిమాలే కాదు డిజిటల్ ప్లాట్‌ఫాంలోనూ జగ్గూభాయ్ హవానే కనిపిస్తోంది. పిట్ట కథలుతో ఓటిటిలో సందడి చేస్తున్న మ్యాన్లీ స్టార్ ముందు ముందు మరిన్ని షోస్‌కు రెడీ అవుతున్నారు.
హీరోగా ఉన్న టైంలో సో సో గా నడిచిన జగపతి బాబు కెరీర్… ఇప్పుడు మాత్రం ఫుల్ స్వింగ్ అందుకుంది. క్యారెక్టర్ రోల్స్ నుంచి మెయిన్ విలన్ వరకు పాత్ర ఏదైనా.. కంటెంట్ ఎలాంటిదైనా… వర్సటైల్ పెర్ఫామెన్స్‌తో వావ్ అనిపిస్తున్నారు జగ్గూభాయ్. అందుకే తెలుగు మేకర్స్ మాత్రమే కాదు.. తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీల నుంచి కూడా జగపతి బాబుకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. శుక్రవారం బర్త్ డే జరుపుకుంటున్న జగ్గూభాయ్ ఫ్యూచర్‌లో మరిన్ని అద్భుతమైన పాత్రలతో అలరించాలని ఆశిస్తూ మనం కూడా విషెస్ తెలియజేద్దాం.
Also Read: