Jagapathi Babu About Gossips:నేను పాల్స్ ప్రామిస్ లు చేయనంటూ తనపై వచ్చిన పుకార్లపై స్పందించిన సీనియర్ యాక్టర్ జగపతిబాబు

జగపతిబాబు. 90ల్లో ఈయన సినిమాలు వస్తే చాలు సంచలనమే. అదే సమయంలో ఈయనకు ప్లే బాయ్ ఇమేజ్ కూడా బాగానే ఉండేది.. ఇదే విషయం పై తాజాగా జగపతి బాబు స్పందిస్తూ.. తాను ఎవరితోనైనా మాట్లాడతాను.. కానీ ఎవరితోనూ డీప్ రిలేషన్ షిప్ కొనసాగించనని చెప్పారు.. తన గురించి ముందే...

Jagapathi Babu About Gossips:నేను పాల్స్ ప్రామిస్ లు చేయనంటూ తనపై వచ్చిన పుకార్లపై స్పందించిన సీనియర్ యాక్టర్ జగపతిబాబు
Follow us
Surya Kala

|

Updated on: Feb 12, 2021 | 9:53 PM

Jagapathi Babu About Gossips: టాలీవుడు సీనియర్ నటుడు జగపతి బాబు సినీ నిర్మాత, దర్శకుడు అయిన వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారుడుగా టాలీవుడ్ లో అడుగు పెట్టాడు. శోభన్ బాబు తర్వాత కుటుంబ కథానేపధ్య కథలతో మహిళా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నాడు. దాదాపు 100 చిత్రాలలో నటించి ఏడు నంది పురస్కారాలను కున్న జగపతి బాబు సినీ కెరీర్ ఎత్తుపల్లాల తో సాగింది.

ఓ వైపు శుభలగ్నం, మావిచిగురు, పెళ్లి పీటలు వంటి కుటుంబ నేపధ్య సినిమాల్లో నటిస్తూనే డిఫరెంట్ నేపధ్య కథలతో కూడా సూపర్ హిట్స్ అందుకున్నాడు జగపతి బాబు. గాయం, అంతఃపురం, ప్రవరాఖ్యుడు, లెజెండ్, రంగస్థలం, శ్రీమంతుడు వంటి సినిమాలతో జగపతిబాబు ఏ పాత్రలోనైనా నటించదలడు అనిపించాడు.. అయితే హీరో జగపతిబాబు. 90ల్లో ఈయన సినిమాలు వస్తే చాలు సంచలనమే. అదే సమయంలో ఈయనకు ప్లే బాయ్ ఇమేజ్ కూడా బాగానే ఉండేది.. ఇదే విషయం పై తాజాగా జగపతి బాబు స్పందిస్తూ.. తాను ఎవరితోనైనా మాట్లాడతాను.. కానీ ఎవరితోనూ డీప్ రిలేషన్ షిప్ కొనసాగించనని చెప్పారు.. తన గురించి ముందే అవతలివారికి చెబుతానని నేను సినిమాలు ఇస్తాననిగానీ.. డబ్బులిస్తానని కానీ ఎటువంటి అబద్దపు వాగ్దానాలు ఇవ్వనని చెప్పారు.. నేను ఎవరినీ మోసగించను.. అది నాకు నచ్చదు.. నా ప్రవర్తనను నా భార్య, పిల్లలు ఎక్కువగా పట్టించుకోరని తెలిపారు.. అంతేకాదు.. తాను ఎదుటివారి గురించి పుకారులు మాట్లాడానని.. గాసిప్స్ ను వినని చెప్పారు జగపతి బాబు.. తన ఫ్యామిలీ తనకు బలమని తెలిపారు జగపతిబాబు

Also Read:

మెగా బ్రదర్స్ ను తలపిస్తోన్న మెగా మేనల్లుళ్లు ప్రేమ.. తమ్ముడికి భరోసానిస్తూ అన్న లేఖ

జగ్గూభాయ్‌.. ఈ ఏడాదిలో ప్రతి నెలా ఒక సినిమా రిలీజ్‌ పక్కా..!