Balakrishna: ‘అన్న దిగుతుండు’.. బాలకృష్ణ బర్త్ డేకు వేరేలెవల్ ప్లాన్స్.. ‘NBK 108’ మేకర్స్ అప్డేట్..
ఇందులో కాజల్, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. బాలయ్య కెరీర్ లోనే 108 చిత్రంగా వస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం ప్రేక్షకులలో ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

నందమూరి నటసింహం బాలకృష్ణ ఈఏడాది వీరసింహరెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు బాలయ్య. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటివరకు కామెడీ జోనర్ చిత్రాలను తెరకెక్కించిన అనిల్.. ఇప్పుడు పూర్తిస్థాయిలో యాక్షన్ డ్రామా రూపొందిస్తున్నారు. ఇందులో కాజల్, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. బాలయ్య కెరీర్ లోనే 108 చిత్రంగా వస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం ప్రేక్షకులలో ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈనెలలో అంటే జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు ఉంది. ఆయన బర్త్ డే కానుకగా అదిరే ట్రీట్స్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఎన్బీకే 108 నుంచి సాలీడ్ అప్డే్ట్ అందించారు మేకర్స్. అన్న దిగుతుండు … ఎన్బీకే బర్త్ డే మాములుగా ఉండదు అంటూ రాసుకొచ్చింది చిత్రయూనిట్. దీంతో బాలయ్య బర్త్ డే కు మంచి క్రేజీ అప్డేట్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.




ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఈ చిత్రం ఏడాది దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది. ఇందులో బాలయ్య సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు.
అన్న దిగుతుండు ?
Team #NBK108 is gearing up to celebrate #NBKLikeNeverBefore on his birthday ?
Bombarding Updates Loading Soon?
Stay hyped for his Arrival?#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7 @harish_peddi… pic.twitter.com/lVDOM3Kjdx
— Shine Screens (@Shine_Screens) June 3, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
