AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. వేదిక ఎక్కడంటే..

ఇప్పుడు అన్ని పనులు కంప్లీట్ చేసుకుని జూన్ 16న భారీ ఎత్తున విడుదల కాబోతుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదల చేయగా.. మరో సాంగ్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Adipurush: తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. వేదిక ఎక్కడంటే..
Adipurush
Rajitha Chanti
|

Updated on: Jun 03, 2023 | 3:20 PM

Share

మోస్ట్ అవైటెడ్ చిత్రం ఆదిపురుష్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామాయణం ఆధారంగా డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండడంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో చెప్పేశారు మేకర్స్. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా గ్రాఫిక్స్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్ని పనులు కంప్లీట్ చేసుకుని జూన్ 16న భారీ ఎత్తున విడుదల కాబోతుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదల చేయగా.. మరో సాంగ్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

జూన్ 6 తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. కొద్ది రోజులుగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తాజాగా వేదిక ఎక్కడనే విషయంపై స్పష్టత వచ్చేసింది. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో ఈ వేడుక నిర్వహించనున్నట్లుగా కన్ఫార్మ్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. జూన్ 6న సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఈవెంట్ స్టార్ట్ కానుందని తెలిపారు. ఇక ఇప్పటివరకు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే జరగని విధంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారట. దాదాపు 200 మంది సింగర్స్, 200 డాన్సర్స్ ఈ వేడుకలో ప్రదర్శనలు ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా.. సీత పాత్రలో కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.