Adipurush:’ఆదిపురుష్’ ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్డేట్ వచ్చేస్తోందా ?.. మరింత ఆసక్తిని పెంచుతోన్న ప్రోమో..

ఇటీవల హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన ఆంజనేయుడి పాత్రకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ నుంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్న అప్డేట్ ఏంటంటే... ఫస్ట్ సింగిల్.

Adipurush:ఆదిపురుష్ ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్డేట్ వచ్చేస్తోందా ?.. మరింత ఆసక్తిని పెంచుతోన్న ప్రోమో..
Adipurush

Updated on: Apr 16, 2023 | 8:03 AM

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న ఈ మూవీపై ఓవైపు భారీగానే అంచనాలు ఉన్నా.. మరోవైపు అనేక సందేహాలు కూడా ఉన్నాయి. మొదటి నుంచి ఈ సినిమా అప్డేట్స్ విషయంలో మేకర్స్ విమర్శపాలవుతున్నారు. గతంలో విడుదలైన టీజర్ పై అసహనం వక్తం చేయడమే కాకుండా.. ప్రభాస్, సైఫ్ లుక్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆడియన్స్. రామాయణ ఇతిహాసం ఆధారంగా వస్తోన్న ఈ మూవీలో రాముడు.. ఆంజనేయుడు.. రావణుడి పాత్రల గెటప్స్.. వీఎఫ్ఎక్స్ పై ప్రేక్షకులు పెదవి విరిచారు. దీంతో వీఎఫ్ఎక్స్ విషయంలో మార్పులు చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన ఆంజనేయుడి పాత్రకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ నుంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్న అప్డేట్ ఏంటంటే… ఫస్ట్ సింగిల్.

ఇటీవల ఈ సినిమా నుంచి జై శ్రీరామ్ సాంగ్ చిన్న బిట్ రిలీజ్ చేశారు మేకర్స్. రామ భక్తులకే కాకుండా జనాలందరికీ ఈ బిట్ ఎంతగానో నచ్చేసింది. ఈ సాంగ్ ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ పాట ఫుల్ వీడియో కోసం అంతా ఎదురుచూస్తున్నారు. అలాగే ఫస్ట్ సింగిల్ పై రోజు రోజుకీ మరింత క్యూరియాసిటి పెరిగిపోతుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి మొదటి పాటను ఏప్రిల్ చివరి వారంలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ క్లారిటీ కూడా రానున్నట్లు టాక్.

డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా.. కృతి సనన్ సీతగా కనిపించనుంది. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తుండగా.. అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.