CPI Narayana: : వివాదాల ‘నారాయణ’.. గతంలోనూ ఇదే తరహా వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో
మెగాస్టార్ చిరంజీవిపై నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘బ్రోకర్, చిల్లర బేరగాడు..’ అంటూ చిరంజీవిపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు నారాయణ.
1. చిరంజీవి పై మెగాస్టార్ చిరంజీవిపై నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘బ్రోకర్, చిల్లర బేరగాడు..’ అంటూ చిరంజీవిపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు నారాయణ. సందర్భం ఏంటంటే.. భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ ప్రధాని నరేంద్ర మోడీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరు సూపర్ స్టార్ కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలో నటించారు, ఆ సినిమాని నిర్మించారు కాబట్టి కృష్ణను పిలవాలి చిరంజీవిని పిలవడమేంటీ.? అని నారాయణ ఫైర్ అయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్‌ని ల్యాండ్ మైన్ అని అది ఎప్పుడు ఎక్కడ ఎలా పేలుతుందో తెలియదు అని అన్నారు నారాయణ.. నారాయణకు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇవి..
2. హిందూదేవుళ్ల పై… హిందూ దేవుళ్లు రాతి విగ్రహాలు కానీ అదే నారాయణ కుటుంబ సమేతంగా తిరుమలకి వెళ్ళారు
3.. గవర్నర్ల పై.. గవర్నర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బ్రోకర్ గా మారారు. వీరి వల్ల వందల కోట్ల ఖర్చు తప్ప ఉపయోగం లేదు. అసలు ఈ వ్యవస్థే వేస్ట్ అని కామెంట్ చేశారు నారాయణ. అలాగే ఎలక్షన్ కమిషన్ విషయంలో చర్యలు తీసుకునే అధికారం పార్లమెంట్ కు తప్ప ఎవరికీ లేదన్న నారాయణ. ముఖ్యమంత్రి చేస్తున్న బాల్య చాపల్య చర్యలను అనుభవంతో కూడిన గవర్నర్ సరి చేయాల్సింది పోయి ముఖ్యమంత్రి తొత్తులుగా మారారు అని అన్నారు.
4. కంగనా పై… వివాదస్పద నటి కంగనా రనౌత్‌పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు విలాసవంతమైన బిక్షగత్తే ఎవరైనా ఉన్నారంటే.. అది ఈ మధ్య పద్మశ్రీ అవార్డు తీసుకున్న నటి కంగనా రనౌత్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమెకు స్వాతంత్య్ర పోరాటం గురించి పెద్దగా తెలియదు ఆ బిరుదు ఇచ్చిన బీజేపీకి అస్సలు తెలియదు అన్నారు. సందర్భం ఏంటంటే..1945లో వచ్చిన స్వాతంత్య్రం బిక్ష అని అసలు స్వాతంత్య్రం బీజేపీ వచ్చిన తరువాత 2014లో అన్న కంగనా ఇంతకంటే బానిసత్వం ఏం ఉంటుందని, నువ్వు అడుక్కోవాలి అనుకుంటే అడుక్కో నీకు బిక్ష ఆర్ఎస్ఎస్ పెడితే.. దాన్ని స్వాతంత్య్ర పోరాటంతో పోలుస్తావా? స్వాతంత్య్ర పోరాటం గురించి మాట్లాడే అర్హత నీకు..నీకు పద్మశ్రీ ఇచ్చిన ఆ ప్రభుత్వానికి కూడా అర్హత లేదంటూ నారాయణ ధ్వజమెత్తారు. కంగనా కుష్టి రోగికంటే మించిన రోగిష్టి అంటూ విమర్శలు చేశారు.
5…సిఎం జగన్, ఇళ్ల స్థలాల పై సీఎం జగన్ ఇంట్లో కుక్కలు కట్టేసేంత స్థలం కూడా పేదలకు ఇవ్వకపోవడం అన్యాయం. కుక్కలు అంటే తనకు గౌరవం ఉందని వాటికి విశ్వాసం ఉందన్నారు నారాయణ. తనను కులం పేరుతో దూషించడం పైన కూడా మండిపాటు. వైయస్ కు సిపిఐ మద్దతు ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదంటూ మంత్రి పెద్దిరెడ్డికి చురకలు అంటించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవినీతి బురద నుంచి పుట్టింది దానిని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది అను కూడా అన్నారు.
5. గీతారెడ్డి పై… మాజీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డికి సింగారించుకోవడంపై ఉన్న శ్రద్ధ సమస్యలపై లేదు అన్నారు. సందర్భం ఏంటంటే..చిన్నతరహా పరిశ్రమలకు విధిస్తున్న విద్యుత్ కోతను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు నారాయణ. ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్స్ (ఫ్యాప్సియా) ఆధ్వర్యంలో ఇందిరాపార్కువద్ద చేపట్టిన దీక్షా శిబిరం, సందర్శించిన నారాయణ గీతారెడ్డికి సమస్యలపై అవగాహన లేదు, సమస్యల పరిష్కారానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డే చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ అవసరాల కోసం సాధించుకోలేని గ్యాస్ ప్రైవేట్ సంస్థలకు ఎలా వస్తోంది అని ప్రశ్నించారు. గీతారెడ్డికి పరిశ్రమల పట్ల ఎలాంటి అవగాహన లేదు, కాబట్టి సీఎం ఈ సమస్యను తన చేతుల్లోకి తీసుకొని పరిష్కరించాలి అని అన్నారు. కరెంటు కోతను ఎత్తేయాలని విజ్ఞప్తి చేస్తూ.. అప్పటి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డికి లేఖ రాశారు.
6. ఎంత అందమో అంత అవినీతి: శ్రీలక్ష్మిపై నారాయణ సిపిఐ కె. నారాయణ మరోసారి తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారు. సందర్భం ఏమిటంటే.. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి. మీడియా ప్రతినిధుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు నారాయణ. ఎంత అందంగా ఉంటుందో అంత దరిద్రమైన అవినీతికి పాల్పడింది శ్రీలక్ష్మి, మొదట్లో శ్రీలక్ష్మి చాలా నిజాయితీగా ఉండేదని, అప్పుడు చూసి ఈ అమ్మాయి కేంద్ర సర్వీసులు వెళ్తుందని అనుకునేవాడినని అన్నారు. నిజాయితీపరులైన ఐఎఎస్ అధికారులు ఎప్పటికప్పుడు బదిలీ అవుతారు ఐఎఎస్ అధికారులు సిబిఐ విచారణను తప్పు పట్టడం సరి కాదు, అలా తప్పు పడుతున్నారంటే అవినీతి ఐఎఎస్ అధికారులను ప్రోత్సహిస్తున్నారని చెప్పాలి, ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మొదటి ముద్దాయి ఈ కేసులో సబితా ఇంద్రా రెడ్డిని అరెస్టు చేయాలి అన్నారు.
7. వివేక హత్య, రోజా పై విశ్వాసపాత్రమైన కుక్కలే ఉంటే వైయస్ వివేకా హత్యకు గురయ్యే వారా? నారాయణ ఘాటు రిప్లై ఇక నగిరి ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్మన్ రోజా చేసిన వ్యాఖ్యలు ఏంటంటే.. చంద్రబాబును వ్యతిరేకించి వైయస్సార్ కు మద్దతు ఇచ్చినప్పుడు తన కులం ఏమైనా మారిందా.? నగరి ఎమ్మెల్యే రోజా మాదిరిగా తాను పార్టీలు, కులాలు మారలేదు అని అన్నారు.