Sridevi: కోర్ట్ సినిమా హీరోయిన్‌ శ్రీదేవికి ఎయిర్‌లైన్స్‌ సర్‌ప్రైజ్.. ఏమిచ్చారో తెలుసా? ఫొటోస్ వైరల్

కోర్ట్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది శ్రీదేవి అప్పాల. ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ తో ఫేమస్ అయిన ఈ అమ్మాయి ఇప్పుడు యూత్ లేటెస్ట్ క్రష్. తాజాగా ఈ అందాల తారకు ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది

Sridevi: కోర్ట్ సినిమా హీరోయిన్‌ శ్రీదేవికి ఎయిర్‌లైన్స్‌ సర్‌ప్రైజ్.. ఏమిచ్చారో తెలుసా? ఫొటోస్ వైరల్
Sridevi Appala

Updated on: Jun 04, 2025 | 4:58 PM

మొదటి సినిమాతోనే హిట్ అందుకోవాలంటే ఎంతో అదృష్టముండాలి. అందరికీ ఇది సాధ్యం కాదు. అయితే ఎంట్రీ సినిమాతోనే అదరగొట్టేసింది శ్రీదేవి అప్పాల. కాకినాడకు చెందిన ఈ అమ్మాయి సోషల్ మీడియా రీల్స్ తో బాగా ఫేమస్ అయ్యింది. ఆమె ట్యాలెంట్ ను గమనించిన కోర్టు సినిమా డైరెక్టర్ రామ్ జగదీష్ కోర్టు సినిమా ఆడిషన్స్ కు పిలిచాడు. అక్కడ కూడా శ్రీదేవి తన ట్యాలెంట్ తో డైరెక్టర్ ను మెప్పించి కోర్టు సినిమా సెట్ లోకి అడుగు పెట్టింది. ఇందులో ఆమె పోషించిన జాబిలి పాత్ర యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక కథలెన్నో చెప్పాలి సింగ్ అయితే ఇప్పటికీ మార్మోగిపోతోంది. కోర్టు సినిమా ఏకంగా రూ.60 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ సినిమాలో హర్ష్ రోహన్, శ్రీదేవి జంటగా నటించారు. అలాగే శివాజీ, ప్రియదర్శి తదితరలు ప్రధాన పాత్రల్లో కనిపించారు. కోర్టు సినిమా తర్వాత బాగా ఫేమస్ అయిపోయింది శ్రీదేవి. ఎక్కడ చూసినా ఈ అమ్మడే కనిపిస్తోంది. తాజాగా ఆమెకు ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఒక సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ విషయాన్ని శ్రీదేవినే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

‘మిమ్మల్ని ఇక్కడ చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ సినిమా సూపర్ హిట్ అయినందుకు అభినందనలు’ అంటూ ఒక నోట్ తో పాటు ఒక జ్ఞాపికను కూడా శ్రీదేవికి బహుమతిగా ఇచ్చింది ఇండిగో సంస్థ. ఈ సందర్భంగా ఇండిగో సంస్థ ఇచ్చిన గిఫ్ట్ ను పట్టుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి పలు ఫొటోలు దిగింది శ్రీదేవి. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు కోర్టు హీరోయిన్ కు మరోసారి కంగ్రాట్స్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇండిగో ఎయిర్ లైన్స్ అందించిన గిఫ్ట్ తో శ్రీదేవి..

Sridevi Appala 1

 

మెగాస్టార్ చిరంజీవితో కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.