AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ ‘బయోపిక్’ రిలీజ్‍కు అవాంతరాలు

త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న‌ నరేంద్రమోదీ బయోపిక్‌ను నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కమిషన్‌ను కోరింది. ఆ సినిమా సార్వత్రిక ఎన్నికలకు ముందు విడుదలవుతోందని, ఇది ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఈసీకి ఇచ్చిన లేఖలో ఎన్‌ఎస్‌యూఐ పేర్కొంది. అంతే కాకుండా ఆ సమయంలో ఎలాంటి ప్రచారాలు అనుమతించబడవని, ఎన్నికల కోడ్ బలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు నరేంద్రమోదీ బయోపిక్‌ను విడుదల చేయడం వెనక రాజకీయ ఉద్దేశ్య‌మే ఉందని […]

మోదీ 'బయోపిక్' రిలీజ్‍కు అవాంతరాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 21, 2019 | 1:32 PM

Share

త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న‌ నరేంద్రమోదీ బయోపిక్‌ను నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కమిషన్‌ను కోరింది. ఆ సినిమా సార్వత్రిక ఎన్నికలకు ముందు విడుదలవుతోందని, ఇది ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఈసీకి ఇచ్చిన లేఖలో ఎన్‌ఎస్‌యూఐ పేర్కొంది. అంతే కాకుండా ఆ సమయంలో ఎలాంటి ప్రచారాలు అనుమతించబడవని, ఎన్నికల కోడ్ బలంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఎన్నికలకు ముందు నరేంద్రమోదీ బయోపిక్‌ను విడుదల చేయడం వెనక రాజకీయ ఉద్దేశ్య‌మే ఉందని ఎన్ఎస్‌యూఐ ఆరోపించింది. ఇది బీజేపీ ప్రచారానికి దోహదపడుతుందని అన్నారు. ఈ విషయమై గోవా ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు మాట్లాడుతూ ‘‘ప్రధానమంత్రిగా అన్ని రకాలుగా ఘోరంగా ఫెయిలైన మోదీకి ఈ సినిమా ఉచిత ప్రచారం చేస్తుంది. ఒక్క మోదీకే కాకుండా ఇది బీజేపీకి సైతం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సినిమాను థియేటర్లలోనే కాకుండా మరే విధంగానైనా విడుదల చేయడాన్ని అడ్డుకుంటాం’’ అని అన్నారు.