AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హద్దులు మీరుతున్న యూట్యూబర్స్‌.. తల్లిదండ్రుల సంబంధంపై దారుణమైన కామెంట్స్

హద్దులు మీరుతున్న యూట్యూబర్స్‌ . హాస్యం పేరుతో అశ్లీల వ్యాఖ్యలు చేస్తున్నారు. తల్లిదండ్రుల సంబంధంపై దారుణంగా మాట్లాడాడు యూట్యూబర్‌ రణవీర్‌ అలహాబాదీ . India's got latent showలో వ్యాఖ్యలు చేసిన రణవీర్‌ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలహాబాదీపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌. తన వ్యాఖ్యలపై సారీ చెప్పాడు రణవీర్‌ అలహాబాదీ.

హద్దులు మీరుతున్న యూట్యూబర్స్‌.. తల్లిదండ్రుల సంబంధంపై దారుణమైన కామెంట్స్
Youtuber Ranveer
Rajeev Rayala
|

Updated on: Feb 10, 2025 | 5:56 PM

Share

సోషల్‌ మీడియాలో భావప్రకటనా స్వేఛ్చ పేరుతో యూట్యూబర్లు దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఆఖరికి తల్లిదండ్రుల సంబంధంపై కూడా అతినీచంగా కామెంట్స్‌ చేస్తున్నారు. దేశంలో టాప్‌ యూట్యూబర్‌గా .. Beer biceps పేరుతో పాపులారిటీ సంపాదించుకున్న రణవీర్‌ అలహాబాదీ ఇండియాస్ గాట్ టాలెంట్ షో( India’s got latent show)లో చేసిన వ్యాఖ్యలపై దేశమంతా దుమారం చెలరేగుతోంది. పేరంట్స్‌పై పచ్చిబూతులు మాట్లాడిన రణవీర్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని పలువురు ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారు.. రణవీర్‌ అలహాబాదీపై ముంబై , ఢిల్లీతో పాటు పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో అశ్లీల వ్యాఖ్యలు చేసిన రణవీర్‌ అలహాబాదీ సారీ చెప్పారు . దేశ ప్రజలు తనను క్షమించాలని కోరారు. షోలో తాను తప్పుగా మాట్లాడినట్టు ఒప్పుకున్నారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియోను తొలగిస్తునట్టు ప్రకటించారు.

అయితే కామెడీ పేరుతో రణవీర్‌ అలహాబాదీ మితిమీరి మాట్లాడినట్టు విమర్శలు వస్తున్నాయి. views కోసం ఇంత దిగజారి మాట్లాడుతారా ? అని జనం ప్రశ్నిస్తున్నారు. భావప్రకటనా స్వేచ్ఛను తాము గౌరవిస్తామని , అదే సమయంలో ఇతరుల భావాలను గాయపర్చడం నేరం అవుతుందన్నారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌.. ఈ వ్యవహారంపై తప్పకుండా కఠినచర్యలు తీసుకుంటామన్నారు..

ఈ వ్యవహారం తరువాత ఇండియాస్ గాట్ టాలెంట్ షోకు స్పాన్సర్‌షిప్‌లు రద్దయ్యాయి. రణవీర్‌ అలహాబాదీపై జాతీయ మానవహక్కుల కమిషన్‌ కూడా సీరియస్‌ అయ్యింది. తన వ్యాఖ్యలపై రణవీర్‌ అలహాబాదీ క్షమాపణలు చెప్పినప్పటికి కూడా వివాదం సద్దుమణగడం లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి