Ram Charan: గ్లోబల్ స్టార్ ఫెవరెట్ హీరో ఎవరో తెలుసా.? అతనంటే రామ్ చరణ్‌కు చాలా ఇష్టమట
రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న విడుదలైంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా ఎదుచూశారు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాల మధ్య విడుదలైంది.. సినిమా విడుదలైన తొలిరోజే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఓపినింగ్స్ కూడా ఈ సినిమాకు భారీగానే వచ్చాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శంకర్ దర్శకత్వంలో వచ్చింది ఈ భారీ బడ్జెట్ సినిమా.. వినయ విధేయ రామ తర్వాత బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మరోసారి రామ్ చరణ్ తో జోడి కట్టింది. అంజలి మరో హీరోయిన్ గా యాక్ట్ చేయగా, ఎస్ జే సూర్య ప్రతినాయకుడి పాత్రలో అదరగొట్టాడు. వీరితో పాటు శ్రీకాంత్, సునీల్, బ్రహ్మానందం, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల వంటి స్టార్ యాక్టర్స్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కు ఇష్టమైన హీరో ఎవరో తెలిపారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ వ్యక్తి ఎవరినైనా అబిమానించవచ్చు. నా కొడుకు హీరో సూర్యకు పెద్ద ఫ్యాన్ అని అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్ సూర్యకు పెద్ద అభిమాని, గతంలోనూ సూర్య అంటే తనకు ఇష్టమని గతంలోనూ తెలిపారు రామ్ చరణ్. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. గేమ్ ఛేంజర్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో అభిమానులంతా ఇప్పుడు చరణ్ నెక్స్ట్ సినిమా పై ఆ అంచనాలు పెట్టుకున్నారు. చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవ్వనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




