Sudarshan: మనోడు గోల్డెన్ స్పూన్.. నెల్లూరులో వచ్చే రెంట్స్ ఎంతో తెలిస్తే మీకు దిమ్మతిరుగుతుంది..
కమెడియన్ సుదర్శన్ తన నెల్లూరు అనుబంధం, కుటుంబ ఆనందం, సినీ రంగ ప్రయాణం గురించి మాట్లాడారు. నేపథ్యం లేకుండా పదేళ్లలో సాధించిన విజయం, దాని వెనుక ఉన్న కృషిని వివరించారు. నెల్లూరు ప్రజల తెలివితేటలు, వ్యాపార దక్షతను ప్రస్తావించారు. నిర్మాణ వ్యాపారం నుండి సినీ రంగంలోకి వచ్చిన తన ప్రస్థానం మిరాకిల్‌గా పేర్కొన్నారు.

కమెడియన్ సుదర్శన్ తన పుట్టిన గడ్డ నెల్లూరుతో తనకున్న అనుబంధాన్ని, కుటుంబ సభ్యులతో ఉన్న ఆనంద క్షణాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నెల్లూరుకు సంబంధించిన వివరాలను, అక్కడి ప్రజల తెలివితేటలను, సినీ పరిశ్రమకు సంబంధించిన విశేషాలను ఆయన వెల్లడించారు. ప్రతి సంక్రాంతి, వినాయక చవితి పండుగలకు తప్పకుండా నెల్లూరులోని తన స్వగ్రామానికి వెళ్తానని సుదర్శన్ తెలిపారు. పని ఉంటే తానూ స్వయంగా వెళ్తానని, లేదంటే కుటుంబ సభ్యులు తనను సందర్శించడానికి వస్తుంటారని పేర్కొన్నారు. తాను నెల్లూరు వెళ్లినప్పుడు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, స్థానికులు ఎంతో ఆనందిస్తారని, తన గురించి గర్వంగా చెప్పుకుంటారని సుదర్శన్ చెప్పారు. నెల్లూరు గురించి మాట్లాడుతూ, అది పూర్తి పల్లెటూరు కాదని, నెల్లూరు పట్టణానికి మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తకాలువ అనే అర్బన్ ప్రాంతమని వివరించారు. తెలుగు సినీ పరిశ్రమలో నెల్లూరు నుంచి చాలా తక్కువ మంది నటులు ఉన్నారని.. తాను, ఆర్.పి మాత్రమే ప్రముఖంగా ఉన్నామని తెలిపారు. ప్రముఖ దివంగత నటుడు రమణారెడ్డి కూడా నెల్లూరు వాసేనని, ఆయన విగ్రహం తమ ప్రాంతంలో ఉందని గుర్తు చేసుకున్నారు. నెల్లూరు వాసులు చాలా తెలివైన వారని, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏదో ఒక వ్యాపారం చేసుకుంటారని సుదర్శన్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్, ఇతర పెద్ద వ్యాపారాలలో నెల్లూరు వాసుల ప్రమేయం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఇది చాలా మందికి తెలియదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో తన ప్రస్థానం గురించి మాట్లాడుతూ, ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా కేవలం పదేళ్లలో ఈ స్థాయికి చేరుకోవడం చిన్న విజయం కాదని సుదర్శన్ అభిప్రాయపడ్డారు. ఈ విజయం తన చుట్టూ ఉన్న వారందరికీ, స్నేహితులకు, పరిశ్రమలోని సహచరులకు ఒక ఉదాహరణగా నిలుస్తుందని చెప్పారు. అయితే, ఈ పదేళ్ల ప్రయాణంలో తాను పడిన కష్టాలు, పోరాటం బయటి ప్రపంచానికి చాలా మందికి తెలియదని, కేవలం తన విజయాన్ని మాత్రమే చూస్తారని సుదర్శన్ అన్నారు. పరిశ్రమలోని వారికి తన కష్టం గురించి ఒక అవగాహన ఉంటుందని తెలిపారు. సినీ రంగంలోకి రాకముందు తన నేపథ్యాన్ని వివరిస్తూ, చదువుపై తనకు పెద్దగా ఆసక్తి లేదని సుదర్శన్ వెల్లడించారు. తన తండ్రి, సోదరుడు మోటార్ ఫీల్డ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారని.. లారీలు, టిప్పర్లు, ఇసుక, కంకర వంటి వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు. ట్రావెల్స్ బిజినెస్ కూడా ఉన్నట్లు వివరించారు. నెల్లూరు టౌన్‌లో తమకు 10 షాపులు వస్తాయని.. వాటికి ప్రతి నెలా రెంట్స్ వస్తాయని.. వాటితో పలు 2, 3 ఇళ్లు కూడా ఉన్నట్లు సుదర్శన్ వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో ఫస్ట ఈ సేవా పెట్టింది తానేనని.. అది అంత ఆశాజనకంగా లేకపోవడంతో మూసివేసినట్లు తెలిపారు. ఇంట్లో వ్యాపార వాతావరణం ఉండటం వల్ల తాను కూడా పలు వ్యాపారాలు చేశానని చెప్పారు. మొత్తానికి సంబంధం లేకుండా అంత దూరం వచ్చి ఇండస్ట్రీలో ఈ స్థాయిలో నిలబడటం ఒక అద్భుతం అని సుదర్శన్ తన ప్రయాణాన్ని అభివర్ణించారు.
Also Read: అంతటి అందం, గుణం, ఆడతనం ఉన్న హీరోయిన్‌ని నేను ఇంతవరకూ చూడలేదు..: రమాప్రభ
