AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni : సీఎస్‌కే ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్ 2026 మ్యాచులకు ధోనీ దూరం

MS Dhoni CSK : తలా ధోనీ గాయం కారణంగా సీజన్ ప్రారంభ మ్యాచ్‌ లకు దూరం కానున్నాడు. ఐపీఎల్ 2026 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

MS Dhoni : సీఎస్‌కే ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్ 2026 మ్యాచులకు ధోనీ దూరం
ధోనీతో పాటు, యువ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డెవాల్డ్ బ్రెవిస్ గాయపడటం సీఎస్‌కేకు మరో ఎదురుదెబ్బ. గాయం కారణంగా బ్రెవిస్ మొదటి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే, అతను కోలుకున్నాడు. తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. తాను ఏప్రిల్ 11న మైదానంలోకి తిరిగి వస్తానని బ్రెవిస్ ఇటీవల అభిమానులకు సందేశం పంపాడు.
Rakesh
|

Updated on: Mar 28, 2026 | 1:23 PM

Share

MS Dhoni : ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వకముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు ఒక చేదు వార్త వినిపించింది. మైదానంలో ధోనీ మెరుపులు చూడాలని ఆశగా ఎదురుచూస్తున్న కోట్లాది మంది ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. తలా ధోనీ గాయం కారణంగా సీజన్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఐపీఎల్ 2026 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎంఎస్ ధోనీ ప్రస్తుతం పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. దీనివల్ల అతను కనీసం రెండు వారాల పాటు మైదానంలోకి దిగే అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ధోనీ వైద్యుల పర్యవేక్షణలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. ఈ గాయం వల్ల అతను సీజన్ ఆరంభంలో కనీసం నాలుగు కీలక మ్యాచ్‌లను కోల్పోనున్నాడు.

ఎన్ని మ్యాచులు మిస్ అవుతాడు?

షెడ్యూల్ ప్రకారం మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై తన తొలి మ్యాచ్ ఆడనుంది. ధోనీ దూరం కావడంతో మార్చి 30 నుంచి ఏప్రిల్ 11 వరకు జరిగే నాలుగు మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండడు. ఒకవేళ కోలుకుంటే ఏప్రిల్ 14న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగే మ్యాచ్‌లో లేదా ఏప్రిల్ 18న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (SRH)తో జరిగే మ్యాచ్‌లో ధోనీ మళ్ళీ మైదానంలో కనిపించే అవకాశం ఉంది. 44 ఏళ్ల ధోనీకి ఇది ఆఖరి ఐపీఎల్ సీజన్ అని వార్తలు వస్తున్న తరుణంలో ఈ గాయం అభిమానులను బాగా ఆందోళనకు గురిచేస్తోంది.

ధోనీ స్థానంలో ఎవరు?

ధోనీ అందుబాటులో లేని పక్షంలో వికెట్ కీపింగ్ బాధ్యతలను కొత్తగా జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ నిర్వహించే అవకాశం ఉంది. అయితే, మిడిలార్డర్‌లో ధోనీ ఇచ్చే ఫినిషింగ్ టచ్‌ను భర్తీ చేయడం ఎవరికైనా కష్టమే. అతని స్థానంలో యువ బ్యాటర్ ఉర్విల్ పటేల్‌ను తీసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. గైక్వాడ్ కెప్టెన్సీలో సంజూ శాంసన్ ఇప్పుడు మరింత కీలకం కానున్నాడు. ధోనీ గైర్హాజరీలో జట్టును ఎలా నడిపిస్తారన్నది ఇప్పుడు సవాల్‌గా మారింది.

CSK పూర్తి మ్యాచ్‌ల జాబితా (IPL 2026):

మార్చి 30: రాజస్థాన్ రాయల్స్ తో (వేదిక: గువాహటి) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 03: పంజాబ్ కింగ్స్ తో (వేదిక: చెన్నై) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 05: ఆర్సీబీ తో (వేదిక: బెంగళూరు) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 11: ఢిల్లీ క్యాపిటల్స్ తో (వేదిక: చెన్నై) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 14: కేకేఆర్ తో (వేదిక: చెన్నై) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 18: సన్‌రైజర్స్ హైదరాబాద్ తో (వేదిక: హైదరాబాద్) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 23: ముంబై ఇండియన్స్ తో (వేదిక: ముంబై) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 26: గుజరాత్ టైటాన్స్ తో (వేదిక: అహ్మదాబాద్) – మధ్యాహ్నం 3:30 గంటలకు

మే 02: ముంబై ఇండియన్స్ తో (వేదిక: చెన్నై) – రాత్రి 7:30 గంటలకు

మే 05: ఢిల్లీ క్యాపిటల్స్ తో (వేదిక: ఢిల్లీ) – రాత్రి 7:30 గంటలకు

మే 10: లక్నో సూపర్ జయంట్స్ తో (వేదిక: చెన్నై) – మధ్యాహ్నం 3:30 గంటలకు

మే 15: లక్నో సూపర్ జయంట్స్ తో (వేదిక: లక్నో) – రాత్రి 7:30 గంటలకు

మే 18: సన్‌రైజర్స్ హైదరాబాద్ తో (వేదిక: చెన్నై) – రాత్రి 7:30 గంటలకు

మే 21: గుజరాత్ టైటాన్స్ తో (వేదిక: చెన్నై) – రాత్రి 7:30 గంటలకు

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us