షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించాడు హర్ష చెముడు. తనదైన కామెడీ టైమింగ్ తో అందరికీ చేరువయ్యాడు. వైవా షార్ట్ ఫిల్మ్ తో ఒక్కసారిగా ఫేమస్ అయిన హర్ష క్రమంగా సినిమాల్లోనూ అవకాశాలు సంపాదించుకున్నాడు. పలు సినిమాల్లో కమెడియన్ గా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఇక రవితేజ నిర్మించిన సుందరం మాస్టర్ సినిమాతో హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోన్న హర్ష తాజాగా ఓ సరికొత్త బైక్ కొన్నాడు. అది కూడా స్పోర్ట్స్ బైక్. సుజుకి హయబుసా1300 మోడల్ బైక్ కొన్న హర్ష తన భార్య అక్షర చేతుల మీదుగా స్టార్ట్ చేయించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు హర్ష. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు హర్షకు కంగ్రాట్స్ అని విషెస్ చెబుతున్నారు.
కాగా హర్ష బైక్ రేసింగ్ కు కూడా వెళుతుంటాడట. ఇప్పటికే అతని గ్యారేజ్ లో రేసింగ్ కు సంబంధించిన బైక్స్ చాలానే ఉన్నాయట. ఇప్పుడు వేరే దేశం నుంచి ముచ్చట పడి మరీ ఈ స్పోర్ట్స్ బైక్ ను తెప్పించుకున్నాడట. ఈ బైక్ ధర దాదాపుగా 15 లక్షలు ఉంటుందని తెలుస్తుంది. కాగా తన డ్రీమ్ బైక్ కొనడంతో సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియో కూడా షేర్ చేసాడు హర్ష.
‘ఒక హాఫ్ డే గ్యాప్ లో బైక్ డెలివరీ అయ్యింది. చాలా హ్యాపీగా ఉంది. దీని కోసం ఎంతో ఎదురుచూశాను. మీ అందరి ప్రేమ, సపోర్ట్ లేకపోతే ఇది జరిగేది కాదు. మీ అందరికీ ఎంతో రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ’ అని ఆ బైక్ కి ముద్దుపెడుతూ ఎమోషనల్ అయ్యాడు హర్ష.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.