Comedian Ali: కమెడియన్ అలీ ఇంట మొదలైన పెళ్లి బాజాలు.. వేడుకగా కూతురు హల్దీ ఫంక్షన్‌

అలీ, జుబేదా దంపతులు, వారి పిల్లలు, బంధువులు.. ముఖానికి పసుపు పూసుకుని బాగ్‌ ఎంజాయ్‌ చేయడమం మనం చూడవచ్చు. అయితే అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక జరిగింది.

Comedian Ali: కమెడియన్ అలీ ఇంట మొదలైన పెళ్లి బాజాలు.. వేడుకగా కూతురు హల్దీ ఫంక్షన్‌
Ali daughter haldi function

Updated on: Nov 25, 2022 | 8:49 AM

ప్రముఖ టాలీవుడ్‌ నటుడు, కమెడియన్‌ అలీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె ఫాతిమా మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కనుంది. దీంతో కుమార్తె పెళ్లి పనుల్లో బిజిబిజీగా మారిపోయారు అలీ దంపతులు. పెళ్లి వేడుకల్లో భాగంగా ఫాతిమా హల్దీ వేడుకను ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను అలీ సతీమణి తన యూట్యూబ్‌ ఛానెల్‌లో షేర్‌ చేయగా అది కాస్తా వైరలవుతోంది. ఇందులో అలీ, జుబేదా దంపతులు, వారి పిల్లలు, బంధువులు.. ముఖానికి పసుపు పూసుకుని బాగ్‌ ఎంజాయ్‌ చేయడమం మనం చూడవచ్చు. అయితే అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. హల్దీ వేడుకలకు కేవలం అలీ కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. అయితే వివాహానికి మాత్రం చాలా గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల నుంచి రాజకీయ ప్రముఖులు, ఇండస్ట్రీ నుంచి పలువురు పెద్దలు ఈ పెళ్లి వేడుకకు హాజరు కానున్నారు.

కాగా అలీ కుమార్తె ఫాతిమా రెమీజు మెడిసిన్ చదువుతోంది. ఇక ఈ ఏడాది ఆగస్టులో హైదరాబాద్ లోని ఒక హోటల్లో కుటుంబ సభ్యులు, కొందరు సినీ ప్రముఖుల సమక్షంలో ఫాతిమా నిశ్చితార్థాన్ని అట్టహాసంగా జరిపించాడు ఆలీ. కాగా ఇటీవలూ ఏపీ ఎలక్ర్టానిక్‌ మీడియా సలహాదారుగా నియమితులయ్యారు అలీ. ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని స్వయంగా కలిశారు అలీ దంపతులు. తన కుమార్తె పెళ్లికి రావాలని ఆహ్వానించారు. ఆతర్వాత గవర్నర్‌ తమిళిసై, మెగాస్టార్‌ చిరంజీవి, రేవంత్‌ రెడ్డిలను కూడా ఇంటికెళ్లి ఆహ్వానించారు. ఇక సినిమా పరిశ్రమకు చెందిన అలీ తన కూతురును.. కుటుంబం మొత్తం వైద్యులతో నిండిన ఒక ఫ్యామిలీకి కోడలిగా పంపించనున్నారట. ఫాతిమాకు కాబోయే వరుడు కూడా డాక్టరేనట.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..