Liger Movie: వచ్చేస్తుంది కోకా 2.0.. విజయ్, అనన్య పోస్టర్ మాములుగా లేదుగా..

ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‎గా నటిస్తుండగా.. రమ్యకృష్ణ విజయ్ తల్లిగా.. మైక్ టైసన్ కీలకపాత్రలో కనిపించనున్నారు.

Liger Movie: వచ్చేస్తుంది కోకా 2.0.. విజయ్, అనన్య పోస్టర్ మాములుగా లేదుగా..
Liger

Edited By:

Updated on: Aug 11, 2022 | 8:46 PM

లైగర్ (Liger ) సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‎గా నటిస్తుండగా.. రమ్యకృష్ణ విజయ్ తల్లిగా.. మైక్ టైసన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్‏ సినిమాపై హైప్ క్రియేట్ చేయగా.. అక్టీ పక్డీ సాంగ్, ఆఫత్ సాంగ్స్ యూట్యూబ్‍ను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం లైగర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న చిత్రయూనిట్.. తాజాగా క్రేజీ అప్డేట్ రివీల్ చేసింది. ఈ సినిమా నుంచి మరో సాంగ్ కోకా 2.0ను విడుదల చేయనున్నట్లు ప్రకటిచింది.

రేపు అంటే ఆగస్ట్ 12న సాయంత్రం 4 గంటలకు లైగర్ నుంచి కోకా 2.0 సాంగ్ విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ విజయ్, అనన్య పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో విజయ్ తలపాగాతో కుర్తా పైజామాతో కనిపించగా. రెడ్ లెహాంగాలో అనన్య మరింత అందంగా కనిపిస్తోంది. డబుల్ ఎనర్జీ, డబుల్ స్వాగ్, డబుల్ బీట్ కోకా 2.0తో మరిన్ని సెలబ్రెషన్స్ జరుపుకుందాం అంటూ క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని హిందీతోపాటు తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషలలో ఆగస్ట్ 25న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఉత్తరాదిలోని ప్రధాన నగరాల్లో లైగర్ ప్రమోషన్స్ చేస్తున్న చిత్రయూనిట్ ఆగస్ట్ 15 నుంచి దక్షిణాదిలో ప్రచారం షూరు చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.