Sarkaru Vaari Paata: మహేష్ బాబు డ్యాన్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన శేఖర్ మాస్టర్.. ఆయనలో అద్భుతమైన రిధమ్ ఉందంటూ..

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట' కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

Sarkaru Vaari Paata: మహేష్ బాబు డ్యాన్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన శేఖర్ మాస్టర్.. ఆయనలో అద్భుతమైన రిధమ్ ఉందంటూ..
Shekar
Follow us
Rajitha Chanti

|

Updated on: May 04, 2022 | 7:37 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అంచనాలని మరో స్థాయికి తీసుకెళ్లింది సర్కారు వారి పాట థియేట్రికల్ ట్రైలర్. తాజాగా విడుదలైన ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఆల్ టైం రికార్డ్ ని సృష్టించింది. సర్కారు వారి పాట ట్రైలర్ 24గంటల్లో 27 మిలియన్స్ వ్యూస్ ని క్రాస్ చేసి టాలీవుడ్ ఫాస్టెస్ట్ వన్ డే రికార్డ్ నెలకొల్పింది. అలాగే 1.2 మిలియన్స్ కు పైగా లైక్స్ సొంతం చేసుకొని రికార్డ్ వేగంతో దూసుకుపోతుంది.

ఇక మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతంలో ‘సర్కారు వారి పాట’ ఆడియో ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచింది. కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్.. ప్రేక్షకులని అమితంగా అలరించాయి. ముఖ్యంగా కళావతి పాట 150మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ ని సృష్టించింది. ఈ పాట లో మహేష్ బాబు వేసిన సిగ్నేచర్ స్టెప్స్ కు సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయి రీల్స్ సందడి చేశాయి. మే 12న ప్రపంచవ్యాప్తంగా సర్కారు వారి పాట గ్రాండ్‌ గా విడుదల కాబోతున్న నేపధ్యంలో సినిమా కోసం గ్రేట్ సిగ్నేచర్ మూమెంట్స్ ని కంపోజ్ చేసిన స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మీడియాతో ముచ్చటించారు.

శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. సర్కారు వారి పాటలో రాబోతున్న మరో పాట కూడా ఫ్యాన్స్ కు గొప్ప ట్రీట్. ఇందులో మహేష్ బాబు గారి స్వాగ్ అండ్ మాస్ రెండూ చూస్తారు. ఆయన సిగ్నేచర్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. మహేష్ బాబు డ్యాన్సులు వండర్ ఫుల్ గా వుంటాయి. ఫ్యాన్స్ కు బాగా నచ్చుతాయి. డ్యాన్స్ ఎంతబాగా చేశారో చూసిన తర్వాత మీరే చెప్తారు.. కళావతి పెన్నీ సాంగ్స్ పై చాలా మంది రీల్స్ చేశారు. ఇప్పుడు రాబోతున్న మాస్ సాంగ్ కూడా అదిరిపోతుంది. అందులో కూడా యునీక్ స్టెప్స్ వుంటాయి. మహేష్ బాబు గారితో సరిలేరు నికెవ్వరులో డ్యాంగ్ డ్యాంగ్, మైండ్ బ్లాక్, సర్కారు వారి పాటలో మూడు సాంగ్స్ చేశాను.. ఆయనలో అద్భుతమైన రిధమ్ వుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ అర్ధం చేసుకుంటే చాలు. మహేష్ బాబు గారితో పనిచేయడం వండర్ ఫుల్ ఎక్స్పీరియన్స్. మనం ఓకే అన్నా .. ”మాస్టర్ ఇంకోసారి చేద్దామా’ అంటారు. ఈ సినిమాలో ఆయన మరింత అందంగా కనిపిస్తారు. డ్యాన్స్ విషయానికి వస్తే సర్కారు వారి పాటలో సరికొత్త మహేష్ బాబు గారిని చూస్తారు. మహేష్ గారి డ్యాన్సులకి వంద మార్కులు వేస్తా అంటూ చెప్పుకొచ్చారు.

Also Read: Viral Photo: ఈ డాడీ లిటిల్ ప్రిన్సెస్ ఎవరో గుర్తుపట్టారా..? తెలుగు కుర్రాళ్లకు దిల్ క్రష్ ఈ చిన్నది..

Tanushree Dutta: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హీరోయిన్.. ఉజ్జయిని ఆలయానికి వెళ్తుండగా..

Degala Babji Movie: డేగల బాబ్జీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. బండ్ల గణేష్ విడుదలయ్యేది అప్పుడే..

F3 Movie: ఈసారి సూపర్ హిట్ పక్కా.. ఎఫ్ 2 కి మించి ఉంటుంది.. ఎడిటర్ తమ్మిరాజు కామెంట్స్..