Anee Master: జానీ మాస్టర్ కేసు పై స్పందించిన అనీ మాస్టర్.. అయన దగ్గర రెండేళ్లు పని చేశానంటూ..

|

Oct 18, 2024 | 2:49 PM

లైంగిక ఆరోపణల నేపథ్యంలో జానీ కు రావాల్సిన నేషనల్ అవార్డును కూడా రద్దు చేశారు. ఇప్పటికే జానీ మాస్టర్ ఇష్యు పై చాలా మంది స్పందించారు. తాజాగాప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ అనీ మాస్ట‌ర్‌ కూడా స్పందించింది.

Anee Master: జానీ మాస్టర్ కేసు పై స్పందించిన అనీ మాస్టర్.. అయన దగ్గర రెండేళ్లు పని చేశానంటూ..
Jani Master
Follow us on

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ ప్రస్తుతం జైలు లో ఉన్న విషయం తెలిసిందే. తన అసిస్టెంట్ పై ఆయన అత్యాచారం చేయడం అలాగే ఆమెను బెదిరించడం కూడా చేశాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ జానీ నేను ఏ తప్పు చేయలేదు. కావాలనే నన్ను ఇరికించారు అని అంటున్నారు. అలాగే జానీ మాస్టర్ భార్య కూడా తన ఎదుగుదలను చూసి కావాలనే ఇలా చేశారు అని ఆరోపిస్తుంది. లైంగిక ఆరోపణల నేపథ్యంలో జానీ కు రావాల్సిన నేషనల్ అవార్డును కూడా రద్దు చేశారు. ఇప్పటికే జానీ మాస్టర్ ఇష్యు పై చాలా మంది స్పందించారు. తాజాగాప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ అనీ మాస్ట‌ర్‌ కూడా స్పందించింది. జానీ అరెస్ట్ అయినా చాలా కాలం తర్వాత ఆమె స్పందించారు.

ఇది కూడా చదవండి : Chiranjeevi: ఏంటీ..! చిరంజీవి పెద్ద కూతురు హీరోయిన్‌గా చేసిందా..! డైరెక్టర్ ఎవరో తెలుసా.?

కాగా అనీ మాస్టర్ మాట్లాడుతూ.. జానీ మాస్టర్ చాలా మంచివారు. ఆయన దగ్గర దాదాపు రెండు సంవత్సరాలు అసిస్టెంట్ గా పని చేశాను అని అన్నారు.  అయితే జానీ మాస్ట‌ర్ అరెస్ట్ అయ్యారు. ఆయన పై లైగిక వేధింపుల కేసు పెట్టారని విని తాను షాక్‌కు గురైయ్యాన‌ని, తనకు అసలు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు అని, వారం రోజుల పాటు ఏం తోచ‌ని స్థితిలో ఉన్న‌ట్లు తెలిపింది అనీ మాస్ట‌ర్‌.

ఇది కూడా చదవండి : ఎంత మోసం..! మసూద అని ముసుగేసారు కదరా..! ఇంత అందమైన అమ్మాయిని దెయ్యాన్ని చేశారు

అంతే కాదు జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రద్దు చేయడం మరింత షాక్ ఇచ్చిందని అన్నారు అనీ. జానీ మాస్ట‌ర్‌కు వచ్చిన నేషనల్ అవార్డ్ రద్దు అవటంతో తాను చాలా బాధపడ్డట్టు తెలిపింది. జానీ త‌ప్పు చేశార‌ని ఇంకా రుజువుకాలేదు. ఎలాంటి నేరం రుజువు అవ్వకముందే.. ఆయన తప్పు చేశారంటూ..  అవార్డు క‌మిటీ తీసుకున్న నిర్ణ‌యం కరెక్ట్ కాదు అని అంటుంది అనీ. జానీ దగ్గర రెండు సంవ‌త్స‌రాలు అసిస్టెంట్ గా వ‌ర్క్ చేశాన‌ని, ఆయన చాలా మంచి వార‌ని తెలిపింది అనీ మాస్టర్ ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మా డాన్సర్స్‌కు ఏదైనా సమస్య వస్తే ముందుగా హెల్ప్ చేసేది జానీ, శేఖర్ , భాను మాస్టర్స్. అప్ప‌ట్లో జానీ మాస్ట‌ర్ చాలా మంచి వ్యక్తి అన్న ఆ అమ్మాయి.. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి అదే జానీ మాస్ట‌ర్ ఆరోపణలు చేసి.. ఆయన పై కేసు పెట్ట‌డం త‌న‌కు ఆశ్చ‌ర్యంగా ఉందని అన్నారు అనీ మాస్ట‌ర్‌. అలాగే లేడీ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న తనకు ఎప్పుడూ కాస్టింగ్ కౌచ్ అనేది ఎదురు కాలేదని అనీ పేర్కొంది.

ఇది కూడా చదవండి :అందచందాలు అదిరిపోయాయి.. కానీ వెనకాల కూడా చూసుకోవాలి కదమ్మా..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.