
ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఇందులో చిరు సరసన త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతోపాటు చిరు చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై సైతం మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విశ్వంభర తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు చిరు. వీరిద్దరి కాంబోలో పక్కా సాలిడ్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ రానున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందు నుంచి ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.
నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కానుకగా అనిల్ రావిపూడి మూవీ టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమాకు మన శంకర్ వరప్రసాద్ గారు అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఇక ఈ టైటిల్ గ్లింప్స్ లో వెంకటేష్ వాయిస్ ఆకట్టుకుంది. మన శంకర్ వరప్రసాద్ గారు పండగకి వచ్చేస్తున్నారు అంటూ వెంకీ వాయిస్ తో టైటిల్ ను రివీల్ చేశారు. ఇక ఈ వీడియో అదిరిపోయిందనే చెప్పాలి.
బీమ్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఇక ఈ టైటిల్ గ్లింప్స్ లో సూట్ వేసుకొని స్టైల్ గా సిగిరెట్ కాల్చుతూ కారు దిగి వస్తున్న బాస్ లుక్ అదిరిపోయింది. అలాగే చివరిలో గుర్రం పట్టుకొని నడుచుకుంటూ వచ్చే షాట్ కూడా సూపర్ అనే చెప్పాలి. మొత్తానికి అనిల్ మరో భారీ హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి