Kuberaa: ‘నాగార్జున ఎవరి కాళ్లకు మొక్కడు.. ఒక్క ఆయనకు తప్ప’.. ఆసక్తికర విషయం బయట పెట్టిన చిరంజీవి

సీనియర్ హీరోలకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునల మధ్య మంచి అనుబంధం ఉంది. ఒకరి ఇళ్లల్లో జరిగే వేడుకలు, ఫంక్షన్లకు మరొకరు తప్పకుండా హాజరవుతుంటారు. అలాగే సినిమా ఈవెంట్లలోనూ తరచూ కలుస్తుంటారు. తాజాగా కుబేర సినిమా సక్సెస్ మీట్ కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Kuberaa: నాగార్జున ఎవరి కాళ్లకు మొక్కడు.. ఒక్క ఆయనకు తప్ప.. ఆసక్తికర విషయం బయట పెట్టిన చిరంజీవి
Chiranjeevi, Nagarjuna

Updated on: Jun 23, 2025 | 6:36 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం కుబేర. టాలీవుడ్ ఫీల్ గుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. అక్కినేని నాగార్జున మరో కీలక పాత్రలో మెరిశారు. జూన్ 20న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. రెండు రోజుల్లోనే కుబేర సినిమా రూ 50 కోట్ల కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. దీంతో చిత్ర బృందం సంతోషంలో మునిగి తేలుతోంది. ఈ క్రమంలోనే ఆదివారం (జూన్ 23) సాయంత్రం హైదరాబాద్ లో కుబేర సక్సెస్ మీట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కుబేర చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన ఆయన తన స్నేహితుడు నాగార్జున గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాగార్జున ఎవరి కాళ్లకు దండ పెట్టడు.. ఒక్క ఆయనకు తప్పా.. అంటూ అక్కేనేని హీరో గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికర విషయం బయట పెట్టారు.

‘ సాధారంగా నాగార్జున ఎవరి కాళ్లకు దండం పెట్టడు.. ఒక్క మీ నాన్నగారి( సునీల్ నారంగ్ తండ్రి నారాయణ్‌దాస్‌ నారంగ్‌) కాళ్లకు తప్పా. నాకు కూడా ఆయన అంటే అంతే ఇష్టం. ఆయన గౌరవాన్ని నిలబెడుతూ ఇప్పుడు మీరిద్దరు కూడా వెళ్లడం చాలా గర్వంగా ఉంది. ఇక థర్డ్ జనరేషన్‌ జాన్వీ కూడా అదే బాటలో వెళ్తోంది’ అని చెప్పుకొచ్చారు చిరంజీవి. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక కుబేర సినిమా విషయానికి వస్తే.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. బాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ తో పాటు దలీప్ తహిల్, సాయాజీ షిండే, దివ్య దేకటే, హరీష్ పెరడి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

కుబేర సినిమా సక్సెస్ మీట్ లో చిరంజీవి, నాగార్జున, ధనుష్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..