మెగాస్టార్ ఇంట్లో దీపావళి సంబరాలు.. గెస్ట్‌లుగా వెంకటేష్, నాగార్జున , నయనతార

మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు థియేటర్ల వద్ద భారీ కటౌట్స్.. పాలభిషేకాలతో ఫ్యాన్స్ చేసే హడావిడి గురించి తెలిసిందే.. ఇక బాస్ సినిమా టికెట్స్ కోసం చొక్కాలు చింపుకునేవాళ్లు. తాజాగా చిరంజీవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి.

మెగాస్టార్ ఇంట్లో దీపావళి సంబరాలు.. గెస్ట్‌లుగా వెంకటేష్, నాగార్జున , నయనతార
Chiranjeevi

Updated on: Oct 20, 2025 | 6:54 PM

దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. దేశవ్యాప్తంగా దీపావళిని ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. నేడు దీపావళి సందర్భముగా సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు దీపావళి విషెస్ తెలుపుతున్నారు. ఇటీవలే బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ లతో పాటు సినీ ఇండస్ట్రీలో ఉన్న చిన్న పెద్ద హీరోలు దర్శకులు, నిర్మాతలు కూడా హాజరయ్యారు.

అలాగే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకకు వెంకటేష్, నాగార్జున, నయనతారతో కలిసి పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. “నా ప్రియమైన స్నేహితులు నాగార్జున, వెంకటేష్ మరియు నా సహనటి నయనతార కుటుంబాలతో కలిసి దీపాల పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అని మెగాస్టార్ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

“ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపుతాయి మరియు జీవితాన్ని నిజంగా ప్రకాశవంతంగా చేసే ప్రేమ, నవ్వు మరియు ఐక్యతను గుర్తు చేస్తాయి అని చిరంజీవి సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర, మన శంకరవరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అనే సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.