Chiranjeevi: ‘థియేటర్లు దొరకడం లేదని నిర్మాతలు బాధపడొద్దు..’ చిరు కీలక కామెంట్స్
సంక్రాంతికి టాప్ హీరోల సినిమాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ఈ సీజన్‌లో సత్తా చాటాలని అంతా కోరుకుంటారు. కానీ కొన్ని సినిమాలు థియేటర్లు దొరకక వాయిదా కూడా పడుతుంటాయి. ఇదే విషయంపై నిర్మాతలకు కీలక సూచన చేశారు చిరంజీవి. అయితే పృథ్వీ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

సంక్రాంతి అంటేనే సినిమాల జాతర. పండగ రేసులో ఉండాలని చాలామంది హీరోలు ఆరాటపడుతూ ఉంటారు. మేకర్స్ కూడా తగ్గేదే లే అన్నట్లు పండక్కి రిలీజులు ప్లాన్ చేస్తారు. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ సినిమాలు సంక్రాంతికి రిలీజ్‌కు డేట్స్ లాక్ చేసుకున్నాయి. మరికొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా పండుగకే విడుదలకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా జనవరి 12న గుంటూరు కారం, హను-మాన్ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. అయితే ఒకేసారి ఇన్ని రిలీజ్ అయితే థియేటర్లు దొరకవని.. ఆ ఎఫెక్ట్ చిన్న సినిమాపై బలంగా ఉంటుందని ఆందోళన వ్యక్తమైంది. దీంతో కొన్ని సినిమాలు వాయిదా కూడా పడ్డాయి.
ఇదే అంశంపై హనుమాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. థియేటర్లు దొరకడం లేదని నిర్మాతలు బాధపడొద్దని సూచించారు. సంక్రాంతికి పెద్ద సినిమాల రిలీజ్ అయినా.. చిన్న సినిమాలు హిట్టయిన సందర్భాలు ఉన్నాయన్నారు. పరీక్షా కాలంలో థియేటర్లు దొరక్కపోయినా.. కంటెంట్ ఉంటే సినిమా కచ్చితంగా హిట్ అవుతుందన్నారు. దేవుడి ఆశీస్సులు ఉన్నాయంటే.. ప్రేక్షకులు కచ్చితంగా ఆదరించి, విజయం అందిస్తారని చిరంజీవి చెప్పుకొచ్చారు. సినిమాలో కంటెంట్ ఉంటే సెకండ్ షో చూస్తారు.. అదీ లేకపోతే మరో వారం తర్వాత అయినా చూస్తారన్నారు చిరు. చిత్ర పరిశ్రమ ఎప్పుడూ పచ్చగా ఉండాలని ఆయన కోరారు.
అయితే చిన్న సినిమాలకు పెద్దల ఆశీస్సులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు నటుడు పృథ్వీ. కొత్త వాళ్లను ఆశీర్వదించాలని… కొత్తదనాన్ని ప్రొత్సహించాలని సూచించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.