Pushpa Movie: నేడు ప్రేక్షకుల ముందుకు పుష్ప.. బన్నీ అండ్ టీంకు వెల్లువెత్తుతున్న అభినందనలు..

ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు పుప్ప సినిమా రాబోతుంది. మరికొద్ది గంటల్లో (డిసెంబర్ 17న) థియేటర్లలో పుష్పరాజ్ సందడి

Pushpa Movie: నేడు ప్రేక్షకుల ముందుకు పుష్ప.. బన్నీ అండ్ టీంకు వెల్లువెత్తుతున్న అభినందనలు..
Pushpa
Follow us
Rajitha Chanti

| Edited By: Narender Vaitla

Updated on: Dec 17, 2021 | 5:55 AM

ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు పుప్ప సినిమా రాబోతుంది. మరికొద్ది గంటల్లో పుష్పరాజ్ థియేటర్లలో సందడి చేయనున్నారు. బన్నీ కెరీర్‏లోనే అత్యంత భారీ బడ్జెట్‏తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అలాగే మొదటి సారి బన్నీని ఢీగ్లామర్ లుక్‏లో లారీ డ్రైవర్ కమ్ స్మగ్లర్ పాత్రలో చూసేందుకు అల్లు అర్జున్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పుష్ప నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. మరోవైపు పుష్ప ప్రమోషన్స్ కార్యక్రమాలలో బన్నీతోపాటు.. చిత్రయూనిట్ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్.. పుష్ప మూవీ టీం ముంబైలో ప్రెస్ మీట్ లో ఉన్నారు. అఖండ త్వర్వాత థియేటర్లలో వస్తోన్న మరో భారీ చిత్రం కావడంతో ఇప్పటికే థియేటర్ల వద్ద పుష్ప సందడి మొదలైంది.

ఇక మరికాసేపట్లో ప్రేక్షకుల ముందుకు పుష్ప సినిమా రాబోతున్న తరుణంలో సినీ ప్రముఖులు బన్నీ అండ్ టీంకు అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా పుష్ప టీంకు శుభాకాంక్షలు తెలియజేశారు. ” అల్లు అర్జున్, రష్మిక మందన్నా, డైరెక్టర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ అండ్ టీంకు అభినందనలు. మీ రక్తం, స్వేదం, గుండె, ఆత్మలను పెట్టి పుష్ప సినిమా చేశారు. మీ ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని మనస్పుర్తిగా కోరుకుంటున్నాను.. గుడ్ లక్ ” అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి..

మరోవైపు టాలెంటెడ్ హీరో సాయి ధరమ్ తేజ్ సైతం బన్నీతోపాటు.. పుష్ప చిత్రయూనిట్‏కు అభినందనలు తెలియజేశారు. “పుష్ప వారి రక్తం, స్వేదం నుంచి వచ్చిన కంటెంట్. బన్నీ.. పుష్ప టీంకు వారి కష్టానికి తగిన ప్రతిఫలితం దక్కాలని కోరుకుంటున్నాను. హాట్యాఫ్ సుకుమార్ సర్, దేవీ శ్రీ ప్రసాద్, రష్మిక మందన్నా. బెస్ట్ మాత్రమే అందించడానికి వీరి అంకితభావం ” అంటూ ట్వీట్ చేశారు సాయి ధరమ్ తేజ్.

Also Read: Brahmastra: ‘సామాన్యుల ఊహకు అందనిది, ఈ విశ్వంలో ఏదో జరుగుతోంది’.. ఆసక్తిని పెంచేసిన బ్రహ్మస్త్ర మోషన్ పోస్టర్..

RRR Trailer: రికార్డుల వేటలో దూసుకుపోతున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ ట్రైలర్‌.. ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్‌ సినిమా ఇదే..

Rashmika Mandanna: రష్మికను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కన్నడ బ్యూటీ..