Mahesh Babu’s Mother Death:”మాతృదేవత ఆత్మకి శాంతి చేకూరాలి”.. ఇందిరా దేవి మృతికి మెగాస్టార్ సంతాపం

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి మృతితో ఘట్టమనేని కుటుంబం విషాదంలో మునిగిపోయంది. మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణ వార్త టాలీవుడ్ ను దిగ్బ్రాంతికి గురి చేసింది.

Mahesh Babu's Mother Death:మాతృదేవత ఆత్మకి శాంతి చేకూరాలి.. ఇందిరా దేవి మృతికి మెగాస్టార్ సంతాపం
Chiranjeevi, Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 28, 2022 | 10:45 AM

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి మృతితో ఘట్టమనేని కుటుంబం విషాదంలో మునిగిపోయంది. మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణ వార్త టాలీవుడ్ ను దిగ్బ్రాంతికి గురి చేసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. గత పది రోజులుగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె కన్నుమూశారు. ఇటీవలే ఆమె ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవలే ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. వెంటిలేటర్ పై  ఉన్న ఆమెని కుటుంబసభ్యులు దగ్గరుండి చూసుకున్నారు. మహేష్ బాబు కూడా పదిరోజులుగా తల్లి ఇందిరాదేవి దగ్గరే ఉంటున్నారు. ఇక ఇప్పుడు ఇందిరాదేవి మృతితో ఘట్టమనేని కుటుంబంలో విషాదం నెలకొంది. గత రెండు సంవత్సరాలుగా ఇందిరా దేవికి ఇంట్లోనే ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నారు కుటుంబసభ్యులు.

ఇక మహేష్ బాబుకు తల్లి అంటే ప్రాణం. చాలా సందర్భాల్లో ఆయన తన తల్లి గురించి ప్రస్తావించారు మహేష్. తల్లి అంటే నాకు దైవంతో సమానం. ఆమె పెట్టె కాఫీ అంటే చాలా ఇష్టం అంటూ మహేష్ ఓ స్టేజ్ పై చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇందిరా దేవి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ , సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబుకి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను” అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు చిరు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.