ద‌ర్శ‌కుడు అజయ్ భూప‌తి పేరుతో మోసాలు..అల‌ర్ట‌యిన పోలీసులు

'ఆర్ ఎక్స్ 100' సినిమా ద‌ర్శ‌కుడి పేరుతో మోసాలకు పాల్ప‌డుతోన్న వైనం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. డైరెక్టర్ అజయ్ భూపతి పేరుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు ఆగంత‌కులు.

ద‌ర్శ‌కుడు అజయ్ భూప‌తి పేరుతో మోసాలు..అల‌ర్ట‌యిన పోలీసులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 03, 2020 | 2:02 PM

‘ఆర్ ఎక్స్ 100’ సినిమా ద‌ర్శ‌కుడి పేరుతో మోసాలకు పాల్ప‌డుతోన్న వైనం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. డైరెక్టర్ అజయ్ భూపతి పేరుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు ఆగంత‌కులు. కొత్త సినిమాలో నటించేందుకు అవకాశాలు ఇప్పిస్తామంటూ అజయ్ భూపతి పేరుతో ప్రకటనలు గుప్పించారు. ఈ క్రైమ్ కోసం వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ లను అస్త్రాలుగా ఎన్నుకున్నారు. కొందరు అమ్మాయిల‌కు సినిమాల్లో అవ‌కాశాలు ఇప్పిస్తామ‌ని నేరుగా కాల్ చేశారు చీట‌ర్స్. వారిని ఫోటోలు పంపించాల‌ని కోరారు.

ఈ విష‌యం త‌న వ‌ద్ద‌కు రావ‌డంతో ద‌ర్శకుడు అజ‌య్ భూప‌తి వెంట‌నే స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు నమ్మెద్ద‌ని కోరారు. తన పేరుతో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయ‌న పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. కొన్ని ఆధారాల‌తో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు విచార‌ణ ప్రారంభించారు.