చార్మి పేరెంట్స్‌కు కరోనా పాజిటివ్

ప్రముఖ నటి, నిర్మాత చార్మి తల్లిదండ్రులకు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

  • Ram Naramaneni
  • Publish Date - 10:03 pm, Sun, 25 October 20
చార్మి పేరెంట్స్‌కు కరోనా పాజిటివ్

ప్రముఖ నటి, నిర్మాత చార్మి తల్లిదండ్రులకు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. లాక్‌డౌన్ నుంచి తన పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకున్నారని, కానీ  ఇటీవల హైదరాబాద్​లో పోటెత్తిన వరదల కారణంగా వారు కరోనా వైరస్ బారినపడ్డట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం తెలిసి తానెంతో బాధపడినట్లు వెల్లడించింది. అక్టోబర్ 22న తన తల్లిదండ్రులకు కొవిడ్ పాజిటివ్​గా తేలినట్లు చార్మి పేర్కొంది. ప్రస్తుతం ఆస్పత్రిలో వారు చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. తన తల్లిదండ్రులను త్వరలోనే ఆనందంగా, ఆరోగ్యంగా చూడాలనుకుంటున్నట్లు చెప్పింది. ఎవరైనా సరే సింటమ్స్ కనిపిస్తే వెంటనే టెస్టులు చేయించుకోవాలని, పాజిటివ్ వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని చార్మీ నెటిజన్లను కోరింది.

charmi

actress-charmi-parents-affected-with-covid