Vinayaka Chavithi: సినీతారల వినాయక చవితి సెలబ్రేషన్స్.. మొదటిసారి బేబీ బంప్ ఫోటోతో లావణ్య..

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసిన గణపతి బప్పా మోరియా అంటూ చిన్నా, పెద్ద పండగను ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వాడవాడలో బొజ్జ గణపయ్యకు స్వాగతం పలుకుతున్నారు. సినీతారలు సైతం పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ఫోటోస్ షేర్ చేశారు.

Vinayaka Chavithi: సినీతారల వినాయక చవితి సెలబ్రేషన్స్.. మొదటిసారి బేబీ బంప్ ఫోటోతో లావణ్య..
Vinayaka Chavithi

Updated on: Aug 27, 2025 | 4:00 PM

వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని పట్టించుకోకుండా అందరూ పండగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చవితి వేడుకలను పురస్కరించకుని సినిమా ప్రపంచంలో సరికొత్త హంగామా నెలకొంది. అగ్రతారలు, యంగ్ హీరోహీరోయిన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ తమ ఇంట్లో జరుపుకున్న పండగ ఫోటోస్ షేర్ చేశారు. తన కుటుంబంతో కలిసి ఇంట్లో జరుపుకున్న వినాయక పూజా విధానాన్ని వీడియోగా షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఇక మొదటిసారి బేబీ బంప్ ఫోటోతో కనిపించింది మెగా కోడలు లావణ్య త్రిపాఠి. నేడు వినాయక చవితి సందర్భంగా ఇంట్లో వినాయకుడి పూజ చేసి వరుణ్, లావణ్య కలిసి దిగిన ఫోటోను నెట్టింట చేయడంతో వైరల్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి..

ఇవి కూడా చదవండి

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి..

అభిజిత్..

సైరత్ హీరోయిన్ రింకు రాజ్ గురు..

పవన్ కళ్యాణ్..