
సినిమా ఇండస్ట్రీలో నటిగా సక్సెస్ కావాలంటే అందం, అభినయం ఉన్నప్పటికీ కాస్త అదృష్టం కూడా ఉండాల్సిందే. హీరోయిన్స్ విషయంలో గ్లామర్ పాత్రతోపాటు.. సక్సెస్ అయ్యేందుకు అదృష్టం సైతం కలిసిరావాలి. పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నది ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మొదటి చిత్రంలోనే బోల్డ్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. దీంతో ఒక్కసారిగా ఫిల్మ్ వర్గాల్లో ఈ అమ్మడు హాట్ టాపిక్ అయ్యింది. తొలి చిత్రం సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీ పేరు మారుమోగింది. ఆ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వస్తాయని భావించారు అంతా. కానీ అలా జరగలేదు. అందం, అభినయంతో కట్టిపడేసినప్పటికీ అనుకున్నంత స్థాయిలో మాత్రం అవకాశాలు రాలేదు. దీంతో ఆడపాదడపా చిత్రాల్లో నటించి మెప్పించింది.
అందంతో కుర్రకారు హృదయాలు కొల్లగొట్టిన ఈ చిన్నది కెరీర్ విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. తెలుగులో వరుసగా పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ బ్యూటీకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అలాగే ఎక్కువగా గ్లామర్ పాత్రలతో పేమస్ అయ్యింది. ఆమె మరెవరో కాదు.. పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ త్రవాత వెంకీమామ, డిస్కో రాజా వంటి చిత్రాల్లో నటించినప్పటికీ బ్రేక్ మాత్రం రాలేదు.
ఇవి కూడా చదవండి : బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..
ఇక కొన్నాళ్ల క్రితం డైరెక్టర్ అజయ్ భూపతి నటించిన మంగళవారం చిత్రంలో నటించింది. ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తుంది. కానీ ఇప్పటివరకు ఆమెకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది.
ఇవి కూడా చదవండి :
Telugu Actress : వరుసగా ప్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరోయిన్..