Actress : స్టార్ హీరో మాజీ భార్య.. ఇద్దరు కూతుర్లు తెలుగులో క్రేజీ హీరోయిన్లు.. ఈ నటి ఎవరంటే..
సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ సీనియర్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. ఆమె ఓ స్టార్ హీరో మాజీ భార్య. అలాగే తన ఇద్దరు కూతుర్లు సైతం ఇండస్ట్రీలో తోపు హీరోయిన్లు. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టగలరా.. ? తెలుగు, తమిళంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నటి చిన్ననాటి పిక్ ఇది.

పైన ఫోటోను చూశారు కదా.. ? అందులో కనిపిస్తున్న ఆ చిన్నారి ఓ స్టార్ హీరో మాజీ భార్య. అలాగే ఆమె ఇద్దరు హీరోయిన్లకు తల్లి. తన చిన్న కూతురు ఇప్పుడు ఈ త్రోబ్యాక్ ఫోటోను షేర్ చేసింది. ఆమె మరెవరో కాదండి.. సీనియర్ హీరోయిన్ సారిక. లోకనాయకుడు కమల్ హాసన్ మాజీ భార్య. అంటే.. హీరోయిన్ శ్రుతిహాసన్ తల్లి. సారిక పుట్టినరోజు సందర్భంగా ఆమె చిన్న కూతురు.. శ్రుతి హాసన్ చెల్లెలు అక్షర్ హాసన్ తన తల్లి చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపింది. సారిక.. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ బ్యూటీ. కమల్ హాసన్ జోడిగా టిక్ టిక్ టిక్ అనే చిత్రంలో నటించింది. ఇప్పటికీ హిందీలో అనేక చిత్రాల్లో నటిస్తుంది. 1984లో విడుదలైన ‘గ్యాంగ్వా’ అనే హిందీ చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి నటించింది.
ఆమె చివరిగా 2022లో విడుదలైన అమితాబ్ బచ్చన్ హిందీ చిత్రం ‘ఉంచాయ్’లో నటించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సారిక.. తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కమల్ హాసన్ 1978లో వాణి గణపతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన పదేళ్లకు 1988లో డివోర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత కమల్ నటి సారికతో ప్రేమలో పడ్డారు. కమల్ హాసన్ చిత్రాలకు వ్యక్తిగత కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఉన్న సారిక పెళ్లి చేసుకున్నారు. కానీ పదిహేడళ్లకు వీరు విడాకులు తీసుకున్నారు. కమల్, సారిక దంపతులకు శ్రుతిహాసన్, అక్షర్ హాసన్ జన్మించారు.
ప్రస్తుతం ముంబైలో ఉంటున్న సారిక.. 2022లో మోడ్రన్ లవ్ ముంబై అనే వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటుంది. సారిక పెద్ద కూతురు శ్రుతిహాసన్ తెలుగులో సక్సెస్ ఫుల్ హీరోయిన్. ఇటీవలే సలార్ చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్‌లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..








