Tollywood: ఇప్పుడు యూత్ కలల రాణి.. ఒక్క సినిమాతోనే క్రేజ్.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..

సినీరంగంలో అడుగుపెట్టి ఒకే ఒక్క సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా తక్కువ. కానీ కొన్నేళ్ల పోరాటం తర్వాత అద్భుతమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం ఒకరు.

Tollywood: ఇప్పుడు యూత్ కలల రాణి.. ఒక్క సినిమాతోనే క్రేజ్.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..
Kayadu Lohar

Updated on: May 20, 2025 | 9:16 PM

ప్రస్తుతం దక్షిణాది సినీరంగంలో ఆమె తోపు హీరోయిన్. తమిల సినీ పరిశ్రమలో వరుస సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ ఇటీవల ఆమె నటించిన ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగింది. నిజానికి తమిళంలో నటించిన ఈ బ్యూటికి ఇప్పుడు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ప్రస్తుతం పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ? కేవలం ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఇప్పుడు తమిళం, తెలుగు భాషలలో ఆఫర్స్ అందుకుంటుంది. ఆమె మరెవరో కాదు.. డ్రాగన్ సినిమా అభిమానుల దృష్టిని ఆకర్షించిన కయాదు లోహర్. అస్సాంకు చెందిన ఈ ముద్దుగుమ్మ 2000లో జన్మించింది. ఆమె వయసు 25 సంవత్సరాలు మాత్రమే. 2021లో విడుదలైన కన్నడ చిత్రం ముగిల్ పేటే సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసింది.

2022లో విడుదలైన ‘నైన్టీన్త్ సెంచరీ’ అనే మలయాళ చిత్రంలో నటించింది. ఆ తర్వాత అల్లూరి, ఐ లవ్ యు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. 2023లో విడుదలైన మలయాళ చిత్రం ‘ఒరు జాతి జాతకమ్’లో నటించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత రెండేళ్లల్లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. కానీ ఈ ఏడాదిలో నటించిన డ్రాగన్ సినిమాతో తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో స్టార్ బ్యూటీగా మారింది. దీంతో ఈ అమ్మడు పేరు ఇప్పుడు నెట్టింట మారుమోగింది.

ప్రస్తుతం శింబు నటిస్తోన్న చిత్రంలో కనిపించనుంది కాయదు లోహర్. అలాగే అథర్వతో కలిసి ‘ఇదయం మురళి’ చిత్రంలో నటిస్తుంది. ఇవే కాకుండా జీవీ ప్రకాష్ సరసన ఇమ్మోర్టల్ మూవీలో నటిస్తుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది కాయదు లోహర్.

ఇవి కూడా చదవండి :  

Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..

Tollywood: రస్నా యాడ్‏లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?

Tollywood: అప్పుడు ఐశ్వర్య రాయ్‏కే చెమటలు పట్టించింది.. కట్ చేస్తే.. ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్..

Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..