Tollywood: ఇప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఫుల్ జోష్ మీదున్నస్టార్ హీరో.. ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్టార్ చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. దక్షిణాదిలో వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ హీరోకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. విభిన్నమైన కంటెంట్ చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఖాతాలో వేసుకుంటున్నారు ఈ హీరో. ఇంతకీ ఈ ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.?

Tollywood: ఇప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఫుల్ జోష్ మీదున్నస్టార్ హీరో.. ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..?
Dulquer Salman

Updated on: Jun 25, 2025 | 11:19 AM

పైన ఫోటోలో తన స్నేహితులతో కలిసి చెట్టు పై కూర్చున్న పిల్లలలో ఒకరు ఇప్పుడు స్టార్ హీరో. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి నటుడిగా వెండితెరపై అరంగేట్రం చేసిన ఈ కుర్రాడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. మలయాళంలో హీరోగా సినీప్రయాణం స్టార్ట్ చేసిన అతడు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ తనదైన ముద్ర వేశారు. అతడి ఫాలోయింగ్ చూస్తే షాకే. అలాగే అతడు అమ్మాయిల డ్రీమ్ బాయ్. ఇంతకీ ఈ కుర్రాడు ఎవరో తెలుసా.. ? అతడు మరెవరో కాదండి.. హీరో దుల్కర్ సల్మాన్. మలయాళంలోనే కాకుండా తమిళం, తెలుగు, హిందీ భాషలలో సినీప్రియులకు దగ్గరయ్యారు ఈ స్టార్.

2012లో ‘సెకండ్ షో’ చిత్రంతో అరంగేట్రం చేశారు దుల్కర్ సల్మాన్. ఆ తర్వాత అన్వర్ రషీద్ దర్శకత్వం వహించిన ఉస్తాద్ హోటల్ సినిమాతో హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో మలయాళంలో అతడికి మంచి క్రేజ్ వచ్చేసింది. దీంతో వరుస అవకాశాలు అందుకుంటూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. చార్లీ సినిమాతో ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నారు. ఇప్పటికే మలయాళంతోపాటు తెలుగు, తమిళం భాషలలో మొత్తం 25 సినిమాల్లో నటించారు.

ఇవి కూడా చదవండి

దుల్కర్ నటించిన తొలి తమిళ చిత్రం ‘వాయ్ మూడి పెసలం’. నజ్రియా నజీమ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మహానటి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇందులో సావిత్రి భర్త జెమిని గణేషన్ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత సీతారామం సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్నారు. ఇటీవలే తెలుగులో లక్కీ భాస్కర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు.

ఇవి కూడా చదవండి : 

Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..

Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్‏.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..