Tollywood: కాలేజీలో చీరకట్టులో మెరిసిన అమ్మాయి.. కుర్రాళ్ల కలల రాణి.. సెకండ్ ఇన్నింగ్స్లో జోరు..
పైన ఫోటోలో కాలేజీలో స్నేహితులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చిన అమ్మాయిలను చూశారా.. ? అందులో నేవి బ్లూ కలర్ సారిలో కనిపిస్తున్న అమ్మాయి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తుంది. కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆ వయ్యారి.. ఇప్పుడు అగ్రకథానాయికగా చక్రం తిప్పేస్తుంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా.. ?
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తారల స్కూల్, కాలేజీ డేస్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు ఎంతో మంది హీరోయిన్స్ రేర్ ఫోటోస్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో పద్దతిగా చూడముచ్చటగా కనిపించిన అమ్మాయిలు.. ఇప్పుడు ఇండస్ట్రీలో గ్లామర్ క్వీన్స్గా మతిపోగొట్టేస్తున్నారు. తమకు ఇష్టమైన హీరోయిన్స్ కాలేజీ డేస్ ఫోటోస్ చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు నెటిజన్స్. అందుకే ఇప్పుడు మీ కోసం టాలీవుడ్ అందాల తార రేర్ ఫోటో తీసుకువచ్చాం. పైన ఫోటోలో కాలేజీలో స్నేహితులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చిన అమ్మాయిలను చూశారా.. ? అందులో నేవి బ్లూ కలర్ సారిలో కనిపిస్తున్న అమ్మాయి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తుంది. కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆ వయ్యారి.. ఇప్పుడు అగ్రకథానాయికగా చక్రం తిప్పేస్తుంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా.. ? కుర్రహీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తోన్న హీరోయిన్ త్రిష. ఈ బ్యూటీ కాలేజీ రోజుల్లోని ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది.
త్రిష.. కాలేజీ రోజుల్లోనే నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ సింగర్ ఫల్గుణి పాఠక్ రూపొందించిన మేరీ చునార్ ఉద్ద్ ఉద్ద్ జాయే పాటలో తొలిసారి నటించింది. ఈ సాంగ్ అప్పట్లో యూత్ ను ఆకట్టుకుంది. ఇందులో త్రిషను చూసిన డైరెక్టర్ ప్రియదర్శన్ 2003లో లేసా లేసా అనే సినిమాలో అవకాశమిచ్చాడు. ఆ తర్వాత తెలుగులో ప్రభాస్ జోడిగా వర్షం సినిమాతో పరిచయమైంది. ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించి సహజ నటనతో ఆకట్టుకుంది. దీంతో తెలుగు, తమిళంలో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వచ్చాయి. చాలా కాలం పాటు సౌత్ ఇండస్ట్రీని ఏలిన త్రిష.. ఆ తర్వాత ఆఫర్స్ తగ్గిపోయాయి.
దీంతో ఆడపాదడపా చిత్రాల్లో నటించి అలరించింది. కానీ ఇటీవల డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమా మరోసారి ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ మూవీలో త్రిష నటన, అందం చూసి అడియన్స్ ఫిదా అయ్యారు. చాలా కాలం తర్వాత మరోసారి అద్భుతంగా కనిపించింది త్రిష. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో త్రిష నయా లుక్ చూసి మేకర్స్ ఆశ్చర్యపోయారు. నాలుగు పదుల వయసులోనూ మరింత అందంగా కనిపించింది. ప్రస్తుతం త్రిషకు ఇటు తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పుడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి జోడిగా విశ్వంభర సినిమాలో నటిస్తుంది త్రిష. అలాగే తమిళంలో అజిత్ కొత్త చిత్రంలో నటిస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.