Rashmika Mandanna: ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ రా.. ఇలా చేస్తే ఎలా.. ? రష్మిక ఫన్నీ కామెంట్స్….
విజయ్ ఫ్యామిలీతో రష్మిక ఎంతో సన్నిహితంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి గురించి నిత్యం నెట్టింట ఏదోక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. అయినా వాటి గురించి ఇప్పటివరకు స్పందించలేదు. కానీ ఇటీవల ఆనంద్ దేవరకొండ సినిమాల కోసం రష్మిక ప్రమోషన్లలో పాల్గొంటూ సందడి చేస్తుంది.
బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేసినా.. వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. బేబీ తర్వాత ఆనంద్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ గం గం గణేశా. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని మే 31న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే నిన్న గం గం గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకలకు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అతిథిగా వచ్చింది. ఈ ఈవెంట్లో రష్మికను ఓ ఆటాడుకున్నాడు ఆనంద్ దేవరకొండ. విజయ్ ఫ్యామిలీతో రష్మిక ఎంతో సన్నిహితంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి గురించి నిత్యం నెట్టింట ఏదోక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. అయినా వాటి గురించి ఇప్పటివరకు స్పందించలేదు. కానీ ఇటీవల ఆనంద్ దేవరకొండ సినిమాల కోసం రష్మిక ప్రమోషన్లలో పాల్గొంటూ సందడి చేస్తుంది.
ఇక నిన్న గం గం గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మికను కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగారు ఆనంద్ దేవరకొండ. ముందుగా రష్మిక తన పెట్స్ తో దిగిన ఫోటోస్ చూపిస్తూ అందులో ఏది ఫేవరేట్ అని అడగ్గా.. ఆరా రష్మిక పెట్ డాగ్.. తన ఫస్ట్ బేబీ అని.. స్మార్ట్ విజయ్ పెట్ డాగ్ తన సెకండ్ బేబీ అని చెప్పడం గమనార్హం. అలాగే నీ ఫేవరేట్ కో స్టార్ ఎవరు అంటూ ఆనంద్ అడగడంతో.. మైక్ పక్కన పెట్టేసి నీ యబ్బ అంటూ సరదాగా తిట్టింది. ఆ తర్వాత వెంటనే మైక్ లో ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ రా.. ఇలా స్పాట్ లో పెడితే ఎలా అంటూ సరదాగా అనడంతో అభిమానులు పెద్దగా అరుస్తూ గోల చేశారు.
రౌడీ బాయ్ తన ఫేవరేట్ కోస్టార్ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. అలాగే తనకు ఇష్టమైన టూరిస్ట్ ప్లేస్ వియాత్నం అని తెలిపింది. గం గం గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక, ఆనంద్ మధ్య జరిగిన సరదా ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ప్రస్తుతం రష్మిక పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లో నటిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.