AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న హీరోయిన్.. ఈ చిన్నారి పాన్ ఇండియా సెన్సెషన్..

కేవలం ఒక్క సినిమాతోనే దక్షిణాది ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆమె నటనకు, అందానికి తెలుగు అడియన్స్ ఫిదా అయ్యారు. తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చినప్పటికీ తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటుంది. చిరునవ్వులు చిందిస్తూ మంత్రముగ్దులను చేస్తోన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా.. ? ఆమెకు హీరోలకు సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండోయ్.

Tollywood: ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న హీరోయిన్.. ఈ చిన్నారి పాన్ ఇండియా సెన్సెషన్..
Sai Pallavi
Rajitha Chanti
|

Updated on: Oct 30, 2024 | 3:40 PM

Share

సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటాయి. ఇటీవల కొన్ని నెలలుగా నెట్టింట త్రోబ్యాక్ ట్రెండ్ అంటూ సినీతారల చైల్డ్ హుడ్ ఫోటోస్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే సెన్సెషన్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో చిరునవ్వుతో కట్టిపడేస్తోన్న చిన్నారిని గుర్తుపట్టగలరా.. ? ఆమె అందానికి.. అభినయానికి.. డ్యాన్స్.. చిరునవ్వుకు ప్రతి ఒక్కరు ఫిదా కావాల్సిందే. మలయాళం, తమిళం, తెలుగు భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. ఎంతో మంది కుర్రాళ్ల గుండెల్లో ఆరాధ్యదేవతగా స్థానం సంపాదించుకుంది. ఆ హీరోయిన్ క్రేజ్ ఇప్పుడు పీక్‌లో ఉందని చెప్పొచ్చు. తమిళనాడుకు చెందిన ఈ నటి మలయాళ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే భారీగా అభిమానులను సంపాదించుకుంది.

అందం, అభియనంతో ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఆమె డాక్టర్, అలాగే స్టార్ హీరోస్ అందరి సరసన నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ఎందుకంటే ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఓ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న అంటే రేపు విడుదల కాబోతుంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఏకకాలంలో ఆమె సినిమా రాబోతుంది. దీంతో కొద్ది రోజులుగా తన మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి. ప్రేమమ్ సినిమాతో మలయాళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మకు ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాలోయింగ్ వచ్చింది. ఇక తర్వాత ఫిదా సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చి స్టార్ డమ్ సంపాదించుకుంది.

హీరోయిన్ అంటే గ్లామర్ కాదు యాక్టింగ్.. పాత్ర ప్రాధాన్యత ముఖ్యమంటూ నచ్చిన సినిమాలను ఎంచుకుంటుంది. ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్ సరసన అమరన్ చిత్రంలో నటించింది. ఈ మూవీ రేపు విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ లో సాయి పల్లవి లుక్ ఆకట్టుకుంది. మరోవైపు హిందీలో రామాయణం సినిమా చేస్తుంది. ఇందులో సీత పాత్రలో మరోసారి వెండితెరపై మాయ చేయనుంది.

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్