సోషల్ మీడియాలో చాలా రోజులుగా త్రోబ్యాక్ పిక్చర్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లోనూ ఫేమస్ నటీనటుల చిన్ననాటి జ్ఞాపకాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో తమ అభిమాన నటీనటులను గుర్తుపట్టేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు నెటిజన్స్. ఇప్పటివరకు నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోస్ చూడగానే ఇట్టే గుర్తుపట్టేస్తాము. ఇక మరికొందరిని మాత్రం అస్సలు గుర్తుపట్టలేము. ఇప్పటికే రామ్ చరణ్, అల్లు అర్జున్, రష్మిక, కాజల్, పూజ హెగ్డే, ఎన్టీఆర్ వంటి స్టార్స్ బాల్యం జ్ఞాపకాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా తెలుగు హీరోయిన్ చిన్ననాటి జ్ఞాపకం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె ఎవరో తెలుసుకుందామా. పైన ఫోటోలో ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. బుల్లితెర ప్రపంచంలోకి అడుగుపెట్టి బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా ఫేమస్ అమ్మడు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.. తను మరెవరో కాదండి హీరోయిన్ మృణాల్ ఠాకూర్.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. మరాఠీ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ఆ తర్వాత కుంకుమ భాగ్య సీరియల్ తో ఫేమస్ అయ్యింది. తక్కువ సమయంలోనే ఫ్యామిలీ అడియన్స్ కు దగ్గరయ్యింది. ఆ తర్వాత ఆమె తొలిసారిగా నటించిన చిత్రం లవ్ సోనియా. తర్వాత సూపర్ 30, బట్ల హౌస్, తూఫాన్, ధమకా, జెర్సీ, రాధా చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ఆ తర్వాత మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో వచ్చిన సీతారామం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాతో మరో హిట్టు కొట్టింది. అలాగే విజయ్ దేవరకొండ సరసన నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రంతో పర్వాలేదనిపించుకుంది. ఈ మూవీ తర్వాత మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు. ప్రస్తుతం హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది.
ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..
Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..
Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‌కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.