పై ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా? సినిమాలు ఎక్కువగా చూసేవారైతే కనిపెట్టవచ్చు. ఎందుకంటే ఈ హీరోయిన్ ఎంట్రీనే ఒక సంచలనం. ఆమె నటించిన మొదటి సినిమానే ఏకంగా వంద కోట్లు రాబట్టింది. ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డుతో పాటు పలు పురస్కారాలు సొంతం చేసుకుంది. ఇక ఈ హీరోయిన్ క్రేజ్ అయితే అమాంతం పెరిగిపోయింది. ఆమె అందం, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. ఇక తన క్యూట్‌నెస్‌తో కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది. నాని, నాగచైతన్య, రామ్ పోతినేని , సుధీర్‌బాబు వంటి యంగ్ హీరోలతో సినిమాలు చేసింది. అయితే ఈ మధ్యన ఆమె నటించిన సినిమాలు పెద్దగా హిట్ అవ్వలేదు. అయితే ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈపాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో.. యస్.. ఈ క్యూటీ మరెవరో కాదు మన బేబమ్మ కృతిశెట్టి. ఇవాళ ఆమె పుట్టిన రోజు. దీంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే సందర్భంలో కృతి చిన్ననాటి, అరుదైన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. పై ఫొటోస్ కూడా అందులోదే.
హృతిక్ రోషన్ హీరోగా నటించిన సూపర్ 30 సినిమాలో ఓ చిన్న పాత్రతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కృతి. ఆతర్వాత వైష్ణవ్ తేజ్‌తో కలిసి ఉప్పెనతో హీరోయిన్‌గా పరిచయమైంది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇటీవలే ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. నానితో శ్యామ్ సింగరాయ, నాగచైతన్యతో బంగర్రాజు, కస్టడీ సినిమాల్లో నటించింది కృతి. అలాగే రామ్ పోతినేనితో కలిసి ది వారియర్, సుధీర్ బాబుతో కలిసి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీస్‌లో నటించింది బేబమ్మ. అయితే ఈ సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. అయితే ప్రస్తుతం ఆమె శర్వానంద్‌తో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్టులో నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. తాజాగా కృతి పుట్టిన రోజును పురస్కరింకుని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్ .ఇందులో ఎంతో క్యూట్‌గా కనిపిస్తోంది కృతి.
శర్వానంద్ సినిమాలో హీరోయిన్ గా కృతి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.