Samuthirakani: చరణ్‌కు ఏకష్టం రాకూడదు.. నా సొంత కొడుకులా భావిస్తా.. డైరెక్టర్ సముద్రఖని..
ప్రస్తుతం ఆయన డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. సముద్రఖని కీలకపాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్, అల్లు అర్జున్ ల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఇటీవలే బ్రో సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్ సముద్రఖని. ఇప్పటికే నటుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన ఆయన.. ఇప్పుడు దర్శకుడిగానూ మంచి మార్కులు కొట్టేశారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. సముద్రఖని కీలకపాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్, అల్లు అర్జున్ ల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. చరణ్ ను తన కొడుకుగా భావిస్తానని.. ఆయనకు ఏ కష్టం రాకూడదని కోరుకుంటానని అన్నారు.
సముద్రఖని మాట్లాడుతూ.. “రామ్ చరణ్ తో కలిసి ట్రిపుల్ ఆర్ మూవీ చేశాను. అప్పుడు నన్ను బాబాయ్ అని పిలిచేవాడు. మేమిద్దరం ఆ సినిమా సమయంలో మంచి స్నేహితులమయ్యాం. అతడిని నా సొంత కొడుకుగా భావిస్తాను. తనకు కూతురు క్లీంకార పుట్టినప్పుడు మెసేజ్ పెట్టాను. చరణ్ కు ఏ కష్టం రాకూడదని కోరుకుంటాను. ప్రస్తుతం మేమిద్దరం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాము. అందులో నా పాత్ర చరణ్ పాత్రకు చాలా సన్నిహితంగా ఉంటుంది ” అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. అల వైకుంఠపురంలో బన్నీతో కలిసి నటించానని..తనని అన్బు అర్జున్ అని పిలుస్తానని అన్నారు. అన్బు అంటే ప్రేమ అని అర్థం.. ఆయన అందరితో ప్రేమగా ఉంటాడు. షూటింగ్ సమయంలో తనను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడని.. బన్నీది బంగారం లాంటి మనసు అని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చరణ్ ప్రధాన పాత్రలో శంకర్ రూపొందిస్తోన్న పొలిటికల్ డ్రామా గేమ్ ఛేంజర్ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇందులో చెర్రీ ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడని.. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సినిమాను వచ్చే ఏడాది అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.




