Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌లోకి ఆర్కే నాయుడు ?.. మొగలి రేకులు హీరో రెమ్యూనరేషన్ ఎంతంటే..
ఫేమస్ నటీనటుల నుంచి యూట్యూబర్స్ వరకు చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఈసారి సీజన్ 7 సరికొత్తగా ఉండనున్నట్లు హోస్ట్ నాగ్ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. న్యూ గేమ్ న్యూరూల్స్ న్యూ ఛాలెంజెస్ అంటూ సిక్రెట్ రివీల్ చేసి మరింత క్యూరియాసిటిని పెంచేశారు.
బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రియాల్టీ షో బిగ్‌బాస్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే ఆరు సీజన్స్ పూర్తి చేసుకుని.. ఇప్పుడు ఏడవ సీజన్ కు సిద్ధమవుతుంది. ఇప్పటికే లోగోతోపాటు.. ప్రోమో కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఎప్పటిలాగే ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ చేయనున్నారు. మరోవైపు ఈ సీజన్ కంటెస్టెంట్స్ లీస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఫేమస్ నటీనటుల నుంచి యూట్యూబర్స్ వరకు చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఈసారి సీజన్ 7 సరికొత్తగా ఉండనున్నట్లు హోస్ట్ నాగ్ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. న్యూ గేమ్ న్యూరూల్స్ న్యూ ఛాలెంజెస్ అంటూ సిక్రెట్ రివీల్ చేసి మరింత క్యూరియాసిటిని పెంచేశారు.
అయితే సీజన్ 6 అట్టర్ ప్లాప్ కావడంతో సీజన్ 7 పై మరింత ఫోకస్ పెట్టారట నిర్వాహకులు. ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. బెస్ట్ సెలబ్రెటీస్ ను తీసుకురావడంతోపాటు.. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి, సీరియల్ నటుడు అమర్ దీప్, తేజస్వినితోపాటు మరికొంత మంది ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా మరో ఫేమస్ సెలబ్రెటీ పేరు తెరపైకి వచ్చింది. అతనే సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు.
సాగర్.. ఈ పేరు చెబితే ప్రేక్షకులు అస్సలు గుర్తుపట్టలేరు. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు. అప్పట్లో బుల్లితెరపై ఈ సీరియల్ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆర్కే నాయుడు, మున్నా పాత్రలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు సాగర్. ఈ సీరియల్ తర్వాత పలు చిత్రాల్లో సహాయ పాత్రలలో కనిపించిన సాగర్.. ఆ తర్వాత హీరోగా ఒకటి రెండు సినిమాలు చేశారు. అయితే అవేవి అంతగా హిట్ కాకపోవడంతో హీరోగా సక్సెస్ కాలేకపోయారు.
ఇక చాలాకాలం వెండితెరకు.. ఇటు బుల్లితెరకు దూరంగా ఉంటున్నారు సాగర్. అటు సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా ఉండరు. ఇక ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ 7లోకి ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్నారని.. రెమ్యూనరేషన్ సైతం భారీగా ఉంటుందని టాక్. ఈ షోలో పాల్గొంటున్నందుకు ఆయనకు రూ. 70 నుంచి రూ.80 వేల వరకు టాక్. ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.