BRO Movie: ‘బ్రో’.. బీభత్సం.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో అదరగొడుతున్న పవర్ స్టార్ మూవీ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబోలో డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై నిర్మించగా.. ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బ్రో సందడి మొదలైంది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతుండడంతో మెగా ఫ్యాన్స్ ఇప్పుడు థియేటర్ల వద్ద రచ్చ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబోలో డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై నిర్మించగా.. ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ జూలై 28న రిలీజ్ కానుంది. ఇక మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం నిర్వహించారు. ఇక మరోవైపు బ్రో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి.
పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ముందుగానే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు మేకర్స్. ఇంకెముందు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్.. టికెట్స్ ఓపెన్ చేయగానే గంటలో బుక్ మై షో యాప్‌లో పదివేల టికెట్స్ అమ్ముడయ్యాయి. ఓపెన్ చేసిన గంటలోనే ఏకంగా పదివేలకు పైగా టికెట్స్ సేల్ కావడంతో నిర్మాణ సంస్థతోపాటు అభిమానులు కూడా సంతోషిస్తున్నారు.

Bro Movie
అయితే బ్రో సినిమాకు ఎలాంటి ప్రీమియర్ షోలు, బెనిపిట్ షోలు ఉండవని .. టికెట్స్ రేట్లు పెంపు కూడా ఉండదని గతంలోనే నిర్మాతలు తెలియజేశారు. దీంతో టికెట్స్ ఓపెన్ చేయగానే ముందే రికార్డ్ స్థాయిలో అమ్ముడయ్యాయి.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
