Sridevi: శ్రీదేవి సీరియస్‌గా తీసుకోలేదు.. ఆమెది సహజమరణం కాదు.. అసలు విషయం చెప్పేసిన భర్త బోనీ కపూర్‌

|

Oct 03, 2023 | 6:05 AM

అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై జనాలల్లో ఇప్పటికీ చాలా అనుమానాలు ఉన్నాయి . ఆమె 2018 ఫిబ్రవరి 24న అనుమానాస్పదంగా కన్నుమూసింది. ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌ కోసం దుబాయ్‌కు వెళ్లిన ఆమె అక్కడి ఓ స్టార్ హోటల్‌లోని బాత్‌టబ్‌లో మునిగిపోయి తుదిశ్వాస విడిచింది. ఈ వార్త తెలియడంతో యావత్ సినీ పరిశ్రమ, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా శ్రీదేవి మరణంపై చాలా ఏళ్ల తర్వాత మౌనం వీడారు ఆమె భర్త బోనీ కపూర్‌. ఈ ఘటనకు సంబంధించి తనను చాలా కాలంగా విచారణను ఎదుర్కొన్నట్లు ఆయన తెలిపారు .

Sridevi: శ్రీదేవి సీరియస్‌గా తీసుకోలేదు.. ఆమెది సహజమరణం కాదు.. అసలు విషయం చెప్పేసిన భర్త బోనీ కపూర్‌
Boney Kapoor, Sridevi
Follow us on

అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై జనాలల్లో ఇప్పటికీ చాలా అనుమానాలు ఉన్నాయి . ఆమె 2018 ఫిబ్రవరి 24న అనుమానాస్పదంగా కన్నుమూసింది. ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌ కోసం దుబాయ్‌కు వెళ్లిన ఆమె అక్కడి ఓ స్టార్ హోటల్‌లోని బాత్‌టబ్‌లో మునిగిపోయి తుదిశ్వాస విడిచింది. ఈ వార్త తెలియడంతో యావత్ సినీ పరిశ్రమ, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా శ్రీదేవి మరణంపై చాలా ఏళ్ల తర్వాత మౌనం వీడారు ఆమె భర్త బోనీ కపూర్‌. ఈ ఘటనకు సంబంధించి తనను చాలా కాలంగా విచారణను ఎదుర్కొన్నట్లు ఆయన తెలిపారు . అలాగే శ్రీదేవి మృతికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. ‘ది న్యూ ఇండియన్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనీ కపూర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘శ్రీదేవి మరణం సహజమైనది కాదు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది. విచారణలో నేను 48 గంటల పాటు మాట్లాడాను. అందుకే ఇక మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. భారతీయ మీడియా నుండి చాలా ఒత్తిడి ఉన్నందున వారిని ఈ విధంగా విచారించాలని అక్కడి అధికారులు నాకు చెప్పారు. ఆమెపై హత్యాయత్నం జరగలేదని తెలుసుకున్నారు. నేను లై డిటెక్టర్ పరీక్షతో సహా అనేక పరీక్షలు చేయించుకున్నాను. చివరకు రిపోర్టులో అది ప్రమాదవశాత్తు జరిగిన మరణమని తెలిసింది’ అని బోనీకపూర్ తెలిపారు.

కాగా శ్రీదేవి అందంగా కనిపించేందుకు అనుసరించిన డైట్ వల్లే ఈ మరణం సంభవించిందని బోనీకపూర్ తెలిపారు. ‘ శ్రీదేవి ఎప్పుడూ పస్తులుండేది. స్క్రీన్‌పై అందంగా కనిపించాలని, మంచి బాడీ షేప్‌తో ఉండాలనే కోరికతో ఇలా డైట్‌ పాటించేది. ఈ కారణంగా చాలాసార్లు స్పృహతప్పి పడిపోయింది. ఆమెకు బీపీ తక్కువగా ఉందని వైద్యులు పలుమార్లు హెచ్చరించారు. శ్రీదేవి తన భోజనంలో ఉప్పు వాడలేదు. తన మరణానికి ఇదే కారణం. ఆహారంలో ఉప్పును తీసుకోవాలని డాక్టర్లు సలహాలు ఇచ్చారు. కానీ శ్రీదేవి సీరియస్‌గా తీసుకోలేదు. ఎప్పుడైనా డిన్నర్‌కి బయటకు వెళ్లినప్పుడు కూడా ఉప్పు లేని ఆహారం అడిగేది. ఏదేమైనా శ్రీదేవి వమరణం దురదృష్టకరం. శ్రీదేవి మరణానంతరం మమ్మల్ని ఓదార్చడానికి వచ్చిన నాగార్జున ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి స్ట్రిక్ట్ డైట్‌లో ఉండగా సినిమా షూటింగ్‌లో బాత్‌రూమ్‌లో స్పృహతప్పి పడిపోవడంతో ఆమెకు గాయాలయ్యాయని చెప్పుకొచ్చారు’ అని బోని కపూర్‌ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

భర్త బోనీ కపూర్‌ తో శ్రీదేవి..

స్ట్రిక్ట్ డైట్ వల్లే శ్రీదేవి మరణం..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.