మద్యం బాటిల్ మాయం అయ్యిందని సర్వెంట్‌ను చెప్పుతో కొట్టిన సింగర్.. వీడియో వైరల్
బాలీవుడ్ ప్రముఖ గాయకుడు రహత్ ఫతే అలీ ఖాన్‌కి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రాహత్ ఫతే అలీ ఖాన్ సర్వెంట్‌ను చెప్పుతో కొట్టడం చూడవచ్చు. ఈ వీడియోలో రహత్ ఫతే అలీ ఖాన్ ఒక సర్వెంట్ ను పదే పదే ఒకే ప్రశ్న అడుగుతున్నట్లు కనిపించారు. టేబుల్ మీద ఉన్న మద్యం బాటిల్ ఎక్కడికి పోయింది.?

బాలీవుడ్ ప్రముఖ గాయకుడు రహత్ ఫతే అలీ ఖాన్‌కి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రాహత్ ఫతే అలీ ఖాన్ సర్వెంట్‌ను చెప్పుతో కొట్టడం చూడవచ్చు. ఈ వీడియోలో రహత్ ఫతే అలీ ఖాన్ ఒక సర్వెంట్ ను పదే పదే ఒకే ప్రశ్న అడుగుతున్నట్లు కనిపించారు. టేబుల్ మీద ఉన్న మద్యం బాటిల్ ఎక్కడికి పోయింది.? అని అతన్ని అడుగుతూ చెప్పుతో కొట్టాడు రహత్ ఫతే అలీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తర్వాత రహత్ దీని పై వివరణ కూడా ఇచ్చారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రముఖ గాయకుడు రహత్ ఫతే అలీఖాన్ పనిమనిషిని కొడుతూ కనిపించారు. ముందుగా సర్వెంట్‌ను జుట్టు పట్టుకొని లాగాడు. ఆ తర్వాత అతడిని చెప్పుతో తీవ్రంగా కొట్టాడు. ఆ వ్యక్తి తలపై చెప్పుతో గట్టిగా కొట్టాడు. ఆ సర్వెంట్ భయంతో అక్కడి నుంచి పక్కకు వెళ్లే ప్రయత్నం చేశాడు.. కానీ రాహత్ ఫతే అలీ ఖాన్ అతని వదలలేదు. టేబుల్ మీద ఉన్న మద్యం బాటిల్ ఎక్కడికి పోయింది అంటూ.. మళ్ళీ అదే ప్రశ్నను అడగటం మొదలు పెట్టాడు.
రాహత్ ఫతే అలీఖాన్ ప్రశ్న అడిగినప్పుడు ఆ సర్వెంట్ మౌనంగా ఉండిపోయాడు. వారు చుట్టుపక్కల ఉన్నవారు ఆపే ప్రయత్నం చేశారు. కానీ అతను మాత్రం సర్వెంట్ ను కొట్టడం ఆపలేదు. రాహత్ ఫతే అలీఖాన్ సర్వెంట్ ను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అవ్వడంతో అతను వివరణ ఇచ్చాడు. ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేశాడు రాహత్. తాను కొట్టిన ఆ సర్వెంట్ ను కూడా తీసుకొచ్చి ఈ వీడియో లో అతనికి క్షమాపణ చెప్పాడు. ఇది నాకు నా అసిస్టెంట్ కు మధ్య జరిగిన సంఘటన.. నేను అతన్ని నా కొడుకులా చూసుకుంటాను. మంచి చేసినప్పుడు మెచ్చుకుంటా.. తప్పు చేసినప్పుడు ఇలా కోప్పడతా అని చెప్పుకొచ్చాడు రాహత్ .
Famous singer Rahat Fateh Ali khan beating his servent for bottle of Alcohol pic.twitter.com/9DZwYxgPmV
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) January 27, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
