AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heat Stroke at Night: ఈ సంగతి తెలుసా..? పగలే కాదు.. రాత్రిళ్లు కూడా వడదెబ్బ తగులుతుందట!

Night-time heat stroke: ఈ మధ్య కాలంలో రాత్రిపూట కూడా వేడి, ఉష్ణోగ్రతలు గరిష్టంగా పెరుగుతున్నాయి. దీని ప్రభావం ఆరోగ్యంపై అధికంగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా రాత్రి సురక్షితమని భావించేవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు..

Heat Stroke at Night: ఈ సంగతి తెలుసా..? పగలే కాదు.. రాత్రిళ్లు కూడా వడదెబ్బ తగులుతుందట!
Night Time Heat Stroke
Srilakshmi C
|

Updated on: May 05, 2026 | 8:43 PM

Share

వేసవి తీవ్రత కేవలం పగటిపూట వేడికి మాత్రమే పరిమితం కాదు. ఈ మధ్య కాలంలో రాత్రిపూట కూడా వేడి, ఉష్ణోగ్రతలు గరిష్టంగా పెరుగుతున్నాయి. దీని ప్రభావం ఆరోగ్యంపై అధికంగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా రాత్రి సురక్షితమని భావించేవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పగటిపూట వేడి తగ్గిన తర్వాత కూడా రాత్రిపూట ఉష్ణోగ్రత తగ్గకపోతే శరీరం చల్లబడటానికి అవకాశం ఉండదు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం కష్టమవుతుంది. పెరిగిన వేడి కారణంగా చెమట సరిగ్గా ఆరదు దీంతో శరీరం చల్లబడదు. ఇది వడదెబ్బ తగిలే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉందో, దీనిని నివారించడానికి ఏమి చేయవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..

ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉంది?

పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు దీని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారు తమ శరీర ఉష్ణోగ్రతను సరిగ్గా నియంత్రించుకోలేరు. అంతేకాకుండా ముందు నుంచే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి కూడా అధిక ప్రమాదం ఉంటుంది. మూసి ఉన్న లేదా గాలి, వెలుతురు సరిగా ప్రసరించని గదులలో నివసించే వ్యక్తులు కూడా అధిక ప్రమాదం ఉంటుంది.

నివారణ పద్ధతులు ఏమిటి?

రాత్రిపూట గదిలో ఏసీ, వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం ముఖ్యం. పడుకునే ముందు, పడుకున్న తర్వాత మధ్యలో నీళ్లు తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. తేలికైన, వదులుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. అవసరమైతే ఫ్యాన్ లేదా కూలర్‌ను ఉపయోగించడం మంచిది. వడదెబ్బ ప్రమాదం పగలే కాకుండా రాత్రిపూట కూడా ఉంటుంది. అందువల్ల మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే, ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us
ఈ సంగతి తెలుసా..? పగలే కాదు.. రాత్రిళ్లు కూడా వడదెబ్బ తగులుతుందట!
ఈ సంగతి తెలుసా..? పగలే కాదు.. రాత్రిళ్లు కూడా వడదెబ్బ తగులుతుందట!
ఇకపై మాంసాహారం అక్కర్లేదు.. బి12 విటమిన్ లోపానికి చెక్ పడినట్టే!
ఇకపై మాంసాహారం అక్కర్లేదు.. బి12 విటమిన్ లోపానికి చెక్ పడినట్టే!
ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరిన విజయ్.. వేణుగోపాల్ కీలక కామెంట్స్
ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరిన విజయ్.. వేణుగోపాల్ కీలక కామెంట్స్
చూడటానికి పావురంలా ఉంది అనుకునేరు..
చూడటానికి పావురంలా ఉంది అనుకునేరు..
జుట్టు, గోళ్లు కత్తిరించినప్పుడు నొప్పి కలగకపోవడానికి కారణం ఏంటి?
జుట్టు, గోళ్లు కత్తిరించినప్పుడు నొప్పి కలగకపోవడానికి కారణం ఏంటి?
'కాపస్ కాంతి'తో పత్తి విప్లవం.. చెరకు రైతులకు తీపి కబురు..!
'కాపస్ కాంతి'తో పత్తి విప్లవం.. చెరకు రైతులకు తీపి కబురు..!
మ్యూజిక్ కేవలం బీట్ కాదు బ్రో.. అది మన హృదయాన్ని నేరుగా తాకే వైబ్
మ్యూజిక్ కేవలం బీట్ కాదు బ్రో.. అది మన హృదయాన్ని నేరుగా తాకే వైబ్
మండే ఎండల్లో అకాల వర్షాలు.. వచ్చే 3రోజుల వర్షాలే వర్షాలు
మండే ఎండల్లో అకాల వర్షాలు.. వచ్చే 3రోజుల వర్షాలే వర్షాలు
మందారం మొక్క గుత్తులు గుత్తులుగా పూయాలా.?
మందారం మొక్క గుత్తులు గుత్తులుగా పూయాలా.?
‘చెన్నై’ గూటికి ముంబై కెప్టెన్..? సీఎస్‌కే సీఈఓతో సీక్రెట్ చర్చలు
‘చెన్నై’ గూటికి ముంబై కెప్టెన్..? సీఎస్‌కే సీఈఓతో సీక్రెట్ చర్చలు