Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సరసన ఆ బాలీవుడ్ బ్యూటీ.. స్టార్ డైరెక్టర్ సినిమాలో..

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఇప్పుడు యూత్‏లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు ఈ హీరో. ఆ తర్వాత గీతా గోవిందం

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సరసన ఆ బాలీవుడ్ బ్యూటీ.. స్టార్ డైరెక్టర్ సినిమాలో..
Vijay

Updated on: Feb 22, 2022 | 4:39 PM

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఇప్పుడు యూత్‏లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు ఈ హీరో. ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని టాలీవుడ్ టాప్ హీరోగా మారిపోయాడు. ఈ చిత్రాల తర్వాత డియర్ కామ్రెడ్, టాక్సీవాలా, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఈ రౌడీ హీరో మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ పాన్ ఇండియా స్టార్ అయ్యేందుకు కసరత్తులు చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్ బాక్సర్‏గా కనిపించనున్నాడు. అలాగే.. ఇందులో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవల కంప్లీట్ అయ్యింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇదిలా ఉంటే.. లైగర్ సినిమా అనంతరం విజయ్ మరోసారి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనే నటించనున్నాడు. డైరెక్టర్ పూరీ తెరకెక్కించబోయే జనగణమన సినిమాలోనూ విజయ్ నటించనున్నట్లుగా గతంలోనే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అయితే ఈ సినిమా కంటే ముందు విజయ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్లుగా గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‏గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లుగా టాక్. ఇప్పటికే భరత్ అనే నేను.. వినయ విధేయ రామ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది కియారా.. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ.. టాప్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తోంది.

Also Read: Alekhya Harika: ఎక్స్‏ప్రెషన్ క్వీన్ అంటూ దేత్తడి హారిక పోస్ట్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Ghani: మెగా అభిమానులకు బ్యాడ్‏న్యూస్.. బాబాయ్ సినిమా కోసం గని వెనకడుగు..

Samantha: “ఐ వాన రీ ప్రొడ్యూస్ యూ”.. నెటిజన్ ప్రశ్న.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన సమంత..

Aha Indian Idol Telugu: వరల్డ్స్ బిగ్గెస్ట్ మ్యూజికల్ షో.. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో కర్టెన్ రైజర్ కార్యక్రమం..