AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: షారుఖ్‌ఖాన్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా.? బీటౌన్‌లో హాట్ టాపిక్

అసలు జరుగుతున్నదానిలో షారుఖ్‌ ప్రమేయం ఎంత? అనేది కూడా జనాల మధ్య నలుగుతున్న ఇంట్రస్టింగ్‌ విషయం. ఇండియాలో ఇప్పటిదాకా వెయ్యి కోట్ల మార్కును దాటిన సినిమాలు ఐదు.

Shah Rukh Khan: షారుఖ్‌ఖాన్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా.? బీటౌన్‌లో హాట్ టాపిక్
Shah Rukh Khan
Rajeev Rayala
|

Updated on: Mar 24, 2023 | 6:44 PM

Share

షారుఖ్‌ఖాన్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా? లేదా? హిట్‌ రాకముందు ఒక మాట .. హిట్‌ వచ్చాక ఒక మాట అన్నట్టుంటారా.? అంటూ చర్చ జరుగుతోంది నెట్టింట్లో. అసలు జరుగుతున్నదానిలో షారుఖ్‌ ప్రమేయం ఎంత? అనేది కూడా జనాల మధ్య నలుగుతున్న ఇంట్రస్టింగ్‌ విషయం. ఇండియాలో ఇప్పటిదాకా వెయ్యి కోట్ల మార్కును దాటిన సినిమాలు ఐదు. వాటిలో పఠాన్‌ ఒకటి. యష్‌రాజ్‌ ఫిల్మ్స్ తెరకెక్కించిన స్పై థ్రిల్లర్‌ పఠాన్‌. బేషరమ్‌ పాట విడుదలైనప్పటి నుంచే జనాలను అట్రాక్ట్ చేసిన ఈ సినిమా వెయ్యి కోట్లను దాటి కలెక్ట్ చేసింది. 50 రోజులకు పైగా రన్‌ అవుతోందీ మూవీ. దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత షారుఖ్‌కి హిట్‌ దక్కింది. ఫ్యాన్స్ తో తనకున్న అనుబంధాన్ని స్పెషల్‌గా పంచుకున్నారు షారుఖ్‌. చాలా సార్లు నెట్టింట్లో జనాలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. పఠాన్‌ సక్సెస్‌ పరంపరని కొనసాగిస్తానని కూడా మాటిచ్చారు.

పోస్ట్ పఠాన్‌ షారుఖ్‌ నటిస్తున్న సినిమా జవాన్‌. ఈ చిత్రాన్ని అట్లీ డైరక్ట్ చేస్తున్నారు. విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. నయనతార నాయిక. ప్రియమణి కీ రోల్‌ చేస్తున్నారు. జవాన్‌ని జూన్‌లో రిలీజ్‌ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు అట్లీ. కానీ ఇప్పుడు ఆలస్యమవుతున్న షెడ్యూల్స్ కారణంగా, సినిమా విడుదలలో జాప్యం జరుగుతుందనే టాక్‌ వినిపిస్తోంది. దీపావళి సీజన్‌లో జవాన్‌ని రిలీజ్‌ చేయాలన్నది తాజా ప్లాన్‌ అట.

జవాన్‌ పోస్ట్ పోన్‌ అయితే ఆ ఎఫెక్ట్ డంకీ మీద పడుతుంది. రాజ్‌ కుమార్‌ హిరానీ తెరకెక్కిస్తున్న డంకీ సినిమాను యాక్చువల్‌ రిలీజ్‌ మంత్‌ డిసెంబర్‌. కానీ జవాన్‌ విడుదల దీపావళికి ఫిక్స్ అయితే డంకీని 2024కి పోస్ట్ పోన్‌ చేస్తారనే టాక్‌ ఉంది. అదే జరిగితే ఏడాదిలో మూడు సినిమాలతో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాలనే షారుఖ్‌ కల నెరవేరదు. బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్ తో తమ హీరో హల్‌చల్‌ చేస్తారని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆశలు అడియాసలే అవుతాయి. తరచూ ఫ్యాన్స్ తో మాట్లాడు షారుఖ్‌ ఈ విషయం మీద త్వరలోనే క్లారిటీ ఇస్తారా? లెట్స్ వెయిట్‌ అండ్‌ సీ.

Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?