Mahesh: మహేష్‌- రాజమౌళి సినిమాలో మరో స్టార్‌ హీరో! సూపర్‌స్టార్‌ను ఢీకొట్టే ఫాత్రలో.. ఫ్యాన్స్‌కు పూనకాలే

రాజమౌళి , మహేష్‌ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇదో వెయ్యి డాలర్ల ప్రశ్న. ఆఫ్టర్‌ త్రివిక్రమ్‌ అని అందరికీ తెలిసినా, క్యూరియాసిటీ మాత్రం ఆగట్లేదు జనాలకు. అందులోనూ ఇప్పుడు వైరల్‌ అవుతున్న న్యూస్‌ మాత్రం అందరిలోనూ హై తెచ్చిపెడుతోంది.

Mahesh: మహేష్‌- రాజమౌళి సినిమాలో మరో స్టార్‌ హీరో! సూపర్‌స్టార్‌ను ఢీకొట్టే ఫాత్రలో.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Mahesh Babu, Rajamouli

Edited By: Basha Shek

Updated on: Jul 18, 2023 | 4:36 PM

కొన్ని రూమర్స్ వినడానికి కూడా గమ్మత్తుగా ఉంటాయి. నిజమైతే బావుంటుంది అని అనిపిస్తుంది. ఇప్పుడు మహేష్‌ మూవీ రిలేటెడ్‌గా వినిపిస్తున్న ఓ రూమర్‌ కూడా భలే ఉంది. మన సూపర్‌స్టార్‌తో మిస్టర్ పర్ఫెక్ట్ అనే మాటలు ఘట్టమనేని అభిమానులకు కిక్‌ ఇస్తున్నాయి. రాజమౌళి , మహేష్‌ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇదో వెయ్యి డాలర్ల ప్రశ్న. ఆఫ్టర్‌ త్రివిక్రమ్‌ అని అందరికీ తెలిసినా, క్యూరియాసిటీ మాత్రం ఆగట్లేదు జనాలకు. అందులోనూ ఇప్పుడు వైరల్‌ అవుతున్న న్యూస్‌ మాత్రం అందరిలోనూ హై తెచ్చిపెడుతోంది. మన సూపర్‌స్టార్‌ సినిమాలో నార్త్ మిస్టర్‌ పర్ఫెక్ట్ ఆమీర్‌ఖాన్‌ నటిస్తారనే వార్తను ట్రెండ్‌ చేస్తున్నారు ఫ్యాన్స్. రాజమౌళి సినిమాలో నటించడానికి ఇప్పుడు నార్త్ స్టార్లు కూడా వరుస కడుతున్నారనడంలో ఏమాత్రం వండర్‌ లేదు. గత కొన్నాళ్లుగా యాక్టింగ్‌కి దూరంగా ఉన్న ఆమీర్‌, రాజమౌళి మూవీతో కమ్‌బ్యాక్‌ కావాలనే అనుకుంటున్నట్టు టాక్‌.

మహేష్‌తో అడ్వంచరస్‌ మూవీని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు జక్కన్న. హై ఆక్టేన్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్ తో హాలీవుడ్‌కే సరికొత్త పాఠాలు నేర్పేలా ప్లాన్‌ చేస్తున్నారట మహేష్‌ మూవీని. దానికి తగ్గట్టే స్టార్ కాస్ట్ సెలక్ట్ చేసుకుంటున్నారట. నార్త్ నుంచి ఆమీర్‌, దీపిక రంగంలోకి దిగుతారన్నది ప్రచారంలో ఉన్న వార్త. ఒక్క పార్టే ఉంటుందా? రెండు పార్టులుంటుందా? అనే మాటలూ జరుగుతున్నాయి. విజయేంద్రప్రసాద్‌ ఊరిస్తున్న ప్రకారం అయితే మహేష్ మూవీ రెండు చాప్టర్లతో ఫీస్ట్ ఇవ్వడానికి రెడీ అవుతోందన్నమాట.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.