Krrish 4: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. క్రిష్ 4 వచ్చేస్తున్నాడు.. దర్శకుడు ఎవరో తెలుసా..?

మన దగ్గర కూడా సూపర్ హీరోల సినిమాలు తెరకెక్కాయి.  బాలీవుడ్‌లో 'క్రిష్' సిరీస్ పెద్ద హిట్ గా నిలిచింది. 'కోయి మిల్ గయా', 'క్రిష్', 'క్రిష్ 3' సినిమాలు విజయం సాధించాయి. సూపర్‌హీరో స్టైల్‌లో సినిమాను రూపొందించారు. సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రం ' క్రిష్ 4' రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దీనిపై సిద్ధార్థ్ ఆనంద్ ఓ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.

Krrish 4: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. క్రిష్ 4 వచ్చేస్తున్నాడు.. దర్శకుడు ఎవరో తెలుసా..?
Krrish
Follow us
Rajeev Rayala

|

Updated on: May 04, 2024 | 5:58 PM

హాలీవుడ్ సినిమాలకు మన దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాలు కూడా మంచి సూపర్ హిట్ గా నిలిచాయి. మన దగ్గర కూడా సూపర్ హీరోల సినిమాలు తెరకెక్కాయి.  బాలీవుడ్‌లో ‘క్రిష్’ సిరీస్ పెద్ద హిట్ గా నిలిచింది. ‘కోయి మిల్ గయా’, ‘క్రిష్’, ‘క్రిష్ 3’ సినిమాలు విజయం సాధించాయి. సూపర్‌హీరో స్టైల్‌లో సినిమాను రూపొందించారు. సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రం ‘ క్రిష్ 4’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దీనిపై సిద్ధార్థ్ ఆనంద్ ఓ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.

2021లోనే ‘క్రిష్ 4’ గురించిన అప్‌డేట్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని హృతిక్ రోషన్ అప్ డేట్ ఇచ్చాడు. ఈ చిత్రానికి హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ సినిమాకు దర్శకత్వం ఆయన చేయడం లేదని తెలుస్తుంది. దాంతో ఈ సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యత సిద్ధార్థ్‌ ఆనంద్‌ తీసుకున్నారని అంటున్నారు.

తాజాగా హృతిక్ రోషన్ ఫోటో ఒకటి సోషల్ మీడియా పేజీలో అప్‌లోడ్ చేశారు. ‘అతను వస్తున్నాడు’ అనే క్యాప్షన్‌తో క్రిష్ ఫోటోను పోస్ట్ చేశారు. ‘అవును వస్తున్నాడు’ అని సిద్ధార్థ్‌ ఆనంద్‌ బదులిచ్చారు. దాంతో ఫ్యాన్స్ ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఘనత సిద్ధార్థ్‌కు ఉంది. ఇప్పుడు ‘క్రిష్ 4’కి దర్శకత్వం వహించే బాధ్యత వచ్చిందా అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై టీమ్ నుండే అధికారిక ప్రకటన రావాల్సిఉంది. సిద్ధార్థ్, హృతిక్ రోషన్ గతంలో ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’, ‘ఫైటర్’ సినిమాల్లో కలిసి పనిచేశారు. అందుకే సిద్ధార్థ్‌పై హృతిక్‌పై నమ్మకం ఏర్పడింది. హృతిక్ ప్రస్తుతం ‘వార్ 2’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.