“సాహో”పై ఉత్తరాది ఆక్రోశం..మరీ ఇంత చెత్త రేటింగా?

దక్షిణాది హీరోల చిత్రాలపై ఉత్తరాది పెత్తనం మరోసారి బట్టబయలైంది. ఎంతో కష్టపడి రెండు సంవత్సరాల పాటు తీసిన ప్రభాస్ సాహో చిత్రంపై బాలీవుడ్ విష ప్రచారానికి తెరతీసింది. నార్త్ ఇండస్ట్రీ ఆక్రోశం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. బాలీవుడ్‌లో మంచి పేరున్న సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ వ్యాఖ్యలు దీనికి ఉదాహరణగా నిలిచాయి. రెండేళ్ల పాటు ఎంతో కష్టపడి దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన సాహో మూవీకి ఈ మహానుభావుడు మరీ దారుణంగా 1.5 రేటింగ్ ఇచ్చాడు. […]

సాహోపై ఉత్తరాది ఆక్రోశం..మరీ ఇంత చెత్త రేటింగా?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 30, 2019 | 6:36 PM

దక్షిణాది హీరోల చిత్రాలపై ఉత్తరాది పెత్తనం మరోసారి బట్టబయలైంది. ఎంతో కష్టపడి రెండు సంవత్సరాల పాటు తీసిన ప్రభాస్ సాహో చిత్రంపై బాలీవుడ్ విష ప్రచారానికి తెరతీసింది. నార్త్ ఇండస్ట్రీ ఆక్రోశం ఒక్కొక్కటిగా బయటపడుతోంది.

బాలీవుడ్‌లో మంచి పేరున్న సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ వ్యాఖ్యలు దీనికి ఉదాహరణగా నిలిచాయి. రెండేళ్ల పాటు ఎంతో కష్టపడి దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన సాహో మూవీకి ఈ మహానుభావుడు మరీ దారుణంగా 1.5 రేటింగ్ ఇచ్చాడు. ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా హాలీవుడ్ మూవీని తలదన్నే రీతిలో సుజిత్ డైరెక్ట్ చేసిన సాహో మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజై బాక్సాఫీస్ బద్దలుకొడుతుంది. అయితే దీన్ని చూసి తట్టుకోలేని తరణ్ ఆదర్శ్ అనే విమర్శకుడికి మాత్రం సాహో చిత్రంలో ఏ సీన్ నచ్చలేదు. ప్రతి అంశాన్ని రంద్రాన్వేషణ చేస్తూ విమర్శించాడు.

తరణ్ మంచి క్రిటిక్ కావచ్చు.. కానీ మన దక్షిణాది చిత్రాలకు సరైన రీతిలో రివ్యూ రేటింగ్ ఇవ్వకపోయేసరికి సోషల్ మీడియాలో తరణ్‌పై తీవ్ర స్ధాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యే మూవీలకు రేటింగ్ ఇచ్చే ఆన్‌లైన్ పోర్టల్ ఐఎండీబీ సాహో మూవీకి 7.9 రేటింగ్ ఇచ్చింది. అయితే గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి మూవీకి మంచి రేటింగ్ ఇచ్చి ఇప్పుడు సాహో విషయంలో తరణ్ ఇంత చెత్త రేటింగ్ ఇవ్వడంపై ప్రభాస్ ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు.

ఇదిలా ఉంటే త్వరలో విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవితో పాటు బిగ్‌బీ అమితాబ్ నటించిన మూవీ ‘సైరా’ మూవీ విషయంలో బాలీవుడ్ క్రిటిక్స్ ఎలా రియాక్ట్ అవుతారో అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.