ఆ వెబ్‌సైట్స్‌లో నా ఫోటోలు పెట్టారు.. డిలీట్ చేయకపోతే సహించను.. హీరోయిన్ వార్నింగ్

సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉంటుందో.. అంతే నష్టం ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రెటీల లైఫ్ లో సోషల్ మీడియాలో కీలక పాత్ర పోషిస్తుంది. హీరోయిన్స్ సినిమాలతో పాటు సోషల్ మీడియాతో ఎక్కువగా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది హీరోయిన్స్ ట్రోల్స్ బారిన కూడా పడుతూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ పలు వెబ్ సైట్స్ కు నోటీసులు పంపించింది.

ఆ వెబ్‌సైట్స్‌లో నా ఫోటోలు పెట్టారు.. డిలీట్ చేయకపోతే సహించను.. హీరోయిన్ వార్నింగ్
Tollywood Actress

Updated on: Sep 03, 2025 | 1:29 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. సెలబ్రేటీ ఫ్యామిలీ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ వయ్యారి.. ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే ప్రియుడిని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. అటు సినిమాల్లోనూ మళ్లీ యాక్టివ్ అయ్యింది. తాజాగా మైథాలాజికల్, నేచురల్ థ్రిల్లర్ మూవీతో తెలుగు అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయం కాబోతుంది. ఇన్నాళ్లు హిందీలో పలు చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఆమె .. ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఓ వెబ్ సైట్ పై లీగల్ నోటీసులు పంపింది. తన ఫోటోలను అనుమతి లేకుండా వాడుకున్నారని ఆమె ఆరోపించింది.

ఏడు వింతలను ఏడిపించడానికే పుట్టిందేమో మావ..! డైరెక్టర్ రవికుమార్ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!!

ఇంతకూ ఆమె ఎవరో కాదు బాలీవుడ్ అందాల భామ సోనాక్షి సిన్హా. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ చిన్నది. ఆతర్వాత అక్కడ వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. సౌత్ లోనూ ఓ సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ రజినీకాంత్ హీరోగా నటించిన లింగ సినిమాలో సోనాక్షి హీరోయిన్ గా చేసింది. కాగా సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకుంది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ ఆ మధ్య పెళ్లి పీటలు ఎక్కనున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రభాస్ కల్కి 2లో ఆ యంగ్ హీరో కూడా.. అభిమన్యుడి పాత్రలో ఎవరంటే

ఇన్నిరోజులు బాలీవుడ్ లో సినిమాలు చేసిన ఈ అమ్మడు ఇప్పుడు సుదీర్ బాబు హీరోగా నటిస్తున్న జటాధరా సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ-కామర్స్ వెబ్ సైట్ లకు లీగల్ నోటీసులు జారీ చేసింది సోనాక్షి. ఈమేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ రాసుకొచ్చింది. కొన్ని వెబ్ సైట్స్ లో తన అనుమతి లేకుండా తన ఫోటోలను వాడుకున్నారని ఆమె ఆరోపించింది. తన అనుమతి లేకుండా వాడుకున్న ఫోటోలను వెంటనే డిలీట్ చేయాలని ఆమె డిమాండ్ చేసింది. లేకపోతే కఠినంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అంటూ వార్నింగ్ ఇచ్చింది సోనాక్షి సిన్హా. నేను రకరకాల డ్రస్సులు వేసుకుంటా.. పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ ఉంటా.. పలు బ్రాండ్ల జ్యులరీ ధరిస్తూ ఉంటా.. కొంతమంది ఆ ఫోటోలను వాడుకుంటున్నారు. అలాంటి వారిని నేను సహించను. నా ఫోటోలు తొలగించండి.. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాను అంటూ వార్నింగ్ నోట్ రాసుకొచ్చింది సోనాక్షి.

విక్రమార్కుడు సినిమాలో ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి